అత్యధిక లావాదేవీలు జరుపుతున్నారా? జూన్‌లో ఇవి మర్చిపోవద్దు!

ఆర్థిక లావాదేవీలు( Financial Transactions ) ఎక్కువగా జరిపేవారు జూన్ నెలలో వచ్చే కొన్ని కొత్త రూల్స్ గమనించాల్సిన సమయం ఆసన్నమైంది.అందుకే ఇక్కడ చేయాల్సిన పనులు పూర్తి చేయకపోతే మీరు చిక్కుల్లో పడాల్సి వస్తుంది.

 Know These June Month Deadlines Aadhar Pan Link Epf Pension Details, Latest News-TeluguStop.com

ప్రస్తుతం పాన్ ఆధార్ లింకింగ్, ఈపీఎఫ్ హయ్యర్ పెన్షన్, ఇన్‌కమ్ ట్యాక్స్‌కు సంబంధించిన పలు డెడ్‌లైన్స్ ఉన్నాయి.జూన్‌లో ( June ) మీరు పూర్తి చేయాల్సిన డెడ్‌లైన్స్ ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.

ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ( Income Tax ) అనేకసార్లు డెడ్‌లైన్ పొడిగించిన సంగతి అందరికీ తెలిసినదే.చివరిసారిగా మార్చి 31 వరకు ఉన్న డెడ్‌లైన్‌ను ఇపుడు జూన్ 30 వరకు పొడిగించింది.పాన్, ఆధార్ లింక్ చేయనివారు రూ.1,000 జరిమానాతో జూన్ 30 వరకు ఈ ప్రాసెస్ అనేది పూర్తి చేయొచ్చు.లేకపోతే ఆ తర్వాత ఆధార్ లింక్ చేయని పాన్ కార్డ్ చెల్లదు.అదేవిధంగా ఈపీఎఫ్ పెన్షన్( EPF Pension ) ఎంచుకోవడానికి ఈపీఎఫ్ ఖాతాదారులకు ఆప్షన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

మే 3 వరకు ఉన్న గడువును జూన్ 26 వరకు పొడిగించింది.దీన్ని ఒకసారి పరిశీలించండి.ఇకపోతే, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 కన్నా ఎక్కువ పన్ను చెల్లించాల్సినవారు అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది.మొదటి అడ్వాన్స్ ట్యాక్స్ ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లించడానికి జూన్ 15 చివరి తేదీ అని మర్చిపోవద్దు.

గమనిక: ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేసేవారికి, అందులో ఏవైనా లోపాలు ఉంటే సెక్షన్ 143(2), 142(1) నోటీసులు వస్తుంటాయి.చాలామంది ఈ నోటీసులు పట్టించుకోరు.ఇకపై అలా కుదరదు.

ఈ నోటీసులు జూన్ 30 లోపు వస్తాయి.ఆ తర్వాత నోటీసులకు స్పందించకపోతే ఆదాయపు పన్ను శాఖ స్క్రుటినీ చేసే అవకాశం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube