ప్రపంచంలో టాప్-5 రైల్వే వ్యవస్థలో భారత్ స్థానం ఇదే!

భారత రైల్వే వ్యవస్థ( Indian railway ) గురించి ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించాల్సిన పనిలేదు.

ఇండియన్ రైల్వే ఒక అద్భుతమైన రవాణా వ్యవస్థ! ఇక్కడ అనునిత్యం దూరదూర ప్రాంతాలనుండి లక్షలమంది ప్రజలు.

చావని, పుట్టుకని, పండుగలు, పబ్బాలు, వివాహాలు, అనారోగ్యాలు వంటి వాటిని కారణాలుగా చేసుకొని కుటుంబ సమేతంగా ఈ రైలు మార్గంలో పయనిస్తూ వుంటారు.అందుకే మన భారదేశం( India )లో తిరిగే ఏ ఒక్క రైలూ మనకి ఖాళీగా కనిపించదు.

ప్రతిరోజు, ఇక్కడ సగటున 8,350 కంటే ఎక్కువ రైళ్ళు 125 లక్షలమంది ప్రయాణికులను తీసుకుని దాదాపు 80,000 కిలోమీటర్ల మేర పొడవున్న పట్టాలపై ప్రయాణిస్తాయని సమాచారం.

ఇక గూడ్సు రైళ్ళు గురించి చెప్పేదేముంది.13 లక్షల టన్నుల కంటే ఎక్కువ బరువున్న సరుకులను తీసుకువెళతాయని గణాంకాలు చెబుతున్నాయి.ఒక సామెత కూడా వుంది.

Advertisement

గూడ్సు రైళ్ళు, ప్యాసింజర్‌ రైళ్ళు( Goods Train ) కలిపి ప్రతిరోజు భూమినుండి చంద్రునికి మధ్యవున్న దూరానికి మూడున్నర రెట్లు ఎక్కువ దూరం పయనిస్తాయని! ఇక భారతీయ రైల్వేలు 16 లక్షల మంది ఉద్యోగస్థులను పోషిస్తోంది అంటే ఇక అర్ధం చేసుకోవచ్చు.ఇది నిజంగా ఎంతటి మహత్తరమైన వ్యవస్థో అని.ఈ క్రమంలో ప్రపంచంలోనే టాప్-5 రైల్వే వ్యవస్థలో మన భారతీయ రైల్వే ఒకటిగా వెలుగొందుతోంది.

140 కోట్లకు పైగా జనాభా ఉన్న ఈ దేశంలో రైల్వే వ్యవస్థ ఈస్థాయికి చేరుకోవడం గొప్ప విజయమే.రైల్వే నెట్ వర్క్ పరంగా మన భారత్ నాలుగో స్థానంలో ఉందని తెలుస్తోంది.ఇక పరిమాణం పరంగా 7వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.

కాగా భారత రైల్వే నెట్‌వర్క్ 70,225 కిలోమీటర్లు.ట్రాక్ పొడవు 1,26,366 కిలోమీటర్లు.

ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను కలిగివున్న సంస్థగా మన ఇండియా రికార్డు సృష్టించింది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు