సినిమా ఇండస్ట్రీలో వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది సెలబ్రిటీలు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం.ఉదాహరణకు బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా( Priyanka Chopra ) గురించి తీసుకుంటే ఆమె తనకంటే 15 చిన్నవాడైన బాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనస్( Nick Jonas ) ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
చాలామంది సెలబ్రిటీల మధ్య ఏజ్ వ్యత్యాసం చాలానే ఉంది.తాజాగా కూడా ఒక బుల్లితెర నటి తనకంటే దాదాపు 21 ఏళ్లు పెద్దవాడైన పొలిటిషన్ ను పెళ్లి చేసుకుంది.
దాదాపు 10 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న ఈ నటి తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది.ఎవరు ఏంటి అన్న విషయాల్లోకి వస్తే.బుల్లితెర నటి స్నేహల్ రాయ్( Snehal Rai ) ఇష్క్ కా రంగ్ సఫేద్ సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకుంది.ఆ తర్వాత జన్మో కా బంధన్, విష్, పర్ఫెక్ట్ పతి, ఇచ్ఛప్యారీ నాగిన్ టీవీ షోలలో నటించింది.
ఇటీవల పెళ్లైన మహిళల అందాల పోటీలో పాల్గొన్న స్నేహల్ రాయ్ తన వివాహ బంధం గురించి చెప్పుకొచ్చింది.పొలిటీషియన్ మధ్వేంద్ర కుమార్ రాయ్( Madhvendra Kumar Rai )తో వివాహం జరిగి 10 సంవత్సరాలు అవుతుందని తెలిపింది.
అంతే కాకుండా తన భర్త తనకంటే 21 ఏళ్లు పెద్దవాడని చెప్పి అందరికి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.అంతే కాకుండా తన భర్త కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని చెప్పుకొచ్చింది భామ.అలాగే తాను హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఒక కార్యక్రమంలో మధ్వేంద్రను కలిశానని స్నేహల్ ఆ తర్వాత పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారి చివరికి పెళ్లి చేసుకున్నామని చెప్పుకొచ్చింది స్నేహల్.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్ స్పందిస్తూ ప్రేమకు వయసుతో సంబంధం లేదు అని కొందరు కామెంట్స్ చేయగా, కొందరు మాత్రం వారిద్దరి ఏజ్ వ్యత్యాసం( Age Gap ) గురించి స్పందిస్తూ తిట్టిపోస్తున్నారు.