మహానాడు( Mahanadu ) వేదికగా శనివారం మాట్లాడిన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,( Chandrababu Naidu ) ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇప్పుడు రాజమండ్రి వైపు చూస్తుందని అన్ని దారులు రాజమండ్రి కే దారితీస్తున్నాయని ఈరోజు కార్యక్రమం అదిరిపోయిందని, రేపు ఆదివారం దద్దరిల్లిపోతుందని చెప్పుకొచ్చారు.రెండు రోజులు జరిగే మహానాడు వేడుకలలో మొదటి రోజు ప్రజాప్రతినిధులు సభ గాను రెండవ రోజు భారీ బహిరంగ సభ గాను తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేసింది… ఆదివారం ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు కూడా ఉండడంతో దానికోసం అట్టహాసంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ( TDP ) భారీ స్థాయిలో జన సమీకరణ చేస్తుంది అయితే ఎన్నికలకు ఇంకా సంవత్సరం ఉండగానే మహానాడు వేదికగా మినీ మేనిఫెస్టో విడుదల చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమైందని తెలుస్తుంది.
ఆ దిశగానే చంద్రబాబు నాయుడు శనివారం స్పీచ్ లో హింట్ ఇచ్చారని వచ్చే ఎన్నికలకు శ్రేణులను సమయత్వం చేసి వారికి పార్టీ బవిష్యత్తు కార్యాచరణ పట్ల సంకేతాలు ఇవ్వడానికి కొన్ని కీలకమైన తీర్మానాలను కూడా పార్టీ రెడీ చేస్తుందని.ప్రజలను ఆకట్టుకునే కొన్ని సంక్షేమ పథకాలను , కీలక హామీలను ఈ మేనిఫెస్టోలో చేర్చారని, తద్వారా ప్రజల్లో ఇప్పటినుంచే ఎన్నికల మూడ్ తీసుకురావాలని తెలుగుదేశానికి అనుకూల వాతావరణ ఏర్పాటు చేసుకోవాలని పార్టీ భావిస్తుంది.అందుకే ఎప్పుడూ లేనివిధంగా ఎన్నికలకు సంవత్సరం ముందే మేనిఫెస్టో రిలీజ్ చేయాలని ఆ పార్టీ చూస్తున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తుంది.
అంతేకాకుండా జనసేనతో పొత్తు విషయంలో కూడా ఒక తీర్మానాన్ని ఆదివారం మహానాడు వేదికగా తెలుగుదేశం ప్రవేశపెట్టబోతున్నట్లు స్తెలుస్తుంది.శనివారం జరిగిన ప్రజాప్రతినిధుల వేడుకల్లో మాట్లాడిన తెలుగుదేశం నాయకులు పార్టీ కార్యకర్తల్లో సరికొత్త జోష్ ని తీసుకొచ్చే విధంగా మాట్లాడారు ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు అచ్చం నాయుడు, తూర్పుగోదావరి జిల్లా దళిత నాయకుడు సరిపెల్ల రాజేష్ స్పీచ్ లు ఆకట్టుకున్నాయి ఒక పిట్ట కథ ద్వారా చంద్రబాబు నాయకత్వానికి జగన్ పరిపాలనకు మధ్య వ్యత్యాసాన్ని చెప్పిన రాజేష్ సరిపెల్ల వాగ్దాటి తెలుగుదేశం కార్యకర్తలను అలరించి నట్టుగా తెలుస్తుంది ….పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్న ఉత్సాహం తెలుగు తమ్ముళ్లు కనిపించిందని వార్తలు వస్తున్నాయి