రోజులు మారాయి.నిన్నమొన్నటి వరకు ఓ అమ్మాయి రోడ్డుపై బైక్ నడిపితే చాలా వింతగా చూసే జనాలు నేడు అది షరా మామ్మూలే అన్నట్టు చూస్తున్నారు.
అవును, లింగ సమానత్వం( Gender Equality ) అనేది రోజురోజుకీ పెరగడం హర్శించదగ్గ విషయం.అయితే ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలోని బైక్ ( Bike ) నడుపుతున్న అమ్మాయిని చూసిన నెటిజనం అవాక్కైపోతున్నారు.
అసలు అలా ఎలా? అంటూ నోళ్లెళ్లబెడుతున్న పరిస్థితి.అబ్బాయిలకు సాధ్యం కాని పని ఆ అమ్మాయి ( Woman ) ఎలా చేస్తోంది అంటూ ప్రశ్నలు వేసుకుంటున్నారు.

అవును, ఇక్కడ వైరల్ అవుతున్న వీడియో చూస్తే మీకు కూడా కళ్లు బైర్లు కమ్మడం ఖాయం.వైరల్ అవుతున్న వీడియోలో.ఎరుపు రంగు జాకెట్ ధరించిన ఓ అందమైన యువతి ఏకంగా కొండపైన( Mountain ) చిన్న చిన్న దారుల్లో బైక్‌పై ఎంతో చాకచక్యంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోవడం మనం చూడవచ్చు.ఇక్కడ ఒక్క క్షణం బైక్ కంట్రోల్ తప్పితే ప్రాణాలు పోవడం ఖాయం.
అలాంటి పరిస్థితులలో ఆ యువతి యూ టర్న్స్ తో నిండిన ఒక ఎత్తైన కొండ మీద ఉన్న వంకర రోడ్డుపై బైక్ మీద నుంచి కిందకు దిగడం మనం చూడవచ్చు.

డ్రైవింగ్ చేసే సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా బైక్‌తో పాటు ఆ యువతి వందల అడుగుల మేర లోయలో పడిపోయే అవకాశం వుంది.సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో రైసింగ్ టెక్ అనే ఐడీలో ఈ వీడియో షేర్ కాగా అనేకమంది దానిని చూసి లైక్ చేస్తున్నారు.కాగా ఈ వీడియోని చూసిన నెటిజన్లు అనేకరకాలుగా స్పందిస్తున్నారు.
ఒక మహిళ.తలచుకుంటే ఎంతటి కష్టమైన పనినైనా సునాయాసంగా చేయగలుగుతుంది అని కొంతమంది కామెంట్ చేస్తే, ఈ ఫీట్ చేయడానికి మగాళ్లకు కూడా ధైర్యం చాలదు అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.







