అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్ అక్కడ పునఃప్రారంభం కాబోతోందా?

ఈ ప్రపంచంలో అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్ ఎక్కడుందంటే మొదటగా జపాన్ ( Japan )పేరే వినబడుతుంది.అయితే 2011 ఫుకుషిమా విపత్తు ( Fukushima Nuclear Plant )తర్వాత అక్కడ చాలా చోట్ల నిర్మించిన అణు విద్యుత్ ప్లాంట్లను శాశ్వతంగా మూసివేశారు.

 Is The Biggest Nuclear Power Plant Going To Restart There? Latest News, Fukushim-TeluguStop.com

అయితే కొద్ది రోజుల క్రితమే జపాన్ ప్రభుత్వం, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్ పునఃప్రారంభించాలని నిర్ణయించింది.కాని ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

అవును, రెగ్యులేటర్లు భద్రతా లోపాల కారణంగా అణు విద్యుత్ ప్లాంట్‌ను పునఃప్రారంభాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది.

Telugu Biggest, Japan, Nuclear, Ret, Ups-Telugu NRI

ఈ క్రమంలోనే మిగతా అణు విద్యుత్ ప్లాంట్లను జపాన్ ప్రభుత్వం( Japan govt ) పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.ఇక ఫుకుషిమా డైచి ప్లాంట్ యూనిట్ 1 ప్రైమరీ కంటైన్‌మెంట్ చాంబర్ లోపల పంపిన రోబోటిక్ ప్రోబ్ దాని పీఠం – నేరుగా దాని కోర్ కింద ఉన్న ప్రధాన సహాయక నిర్మాణం – విస్తృతంగా దెబ్బతిన్నట్లు కనుగొన్నారు.దాని మందపాటి కాంక్రీటు వెలుపలి భాగం చాలా వరకు దెబ్బతిందని తేలింది.

దాదాపు 880 టన్నుల అధిక రేడియోధార్మిక కరిగిన అణు ఇంధనం ప్లాంట్ దెబ్బతిన్న రియాక్టర్లలో ఇంకా మిగిలి ఉందని తెలుసుకున్నారు.

Telugu Biggest, Japan, Nuclear, Ret, Ups-Telugu NRI

ఇక నిపుణులు ఏం చెబుతున్నారంటే, యూనిట్ 1 లోపల కరిగిన ఇంధనం చాలావరకు దెబ్బతిందని చెబుతున్నారు.ప్రాథమిక కంటైన్‌మెంట్ కాంక్రీట్ పునాది పడిపోయి ఉండవచ్చని కూడా అంచనా వేస్తున్నారు.ఇకపోతే, న్యూక్లియర్ రెగ్యులేషన్ అథారిటీ బుధవారం జరిగిన సమావేశంలో, కరిగే పగుళ్లు, రంధ్రాల నుండి రేడియోధార్మిక పదార్థాల లీక్‌తో సహా, పీఠం దెబ్బతినడం వల్ల కలిగే నష్టాలను అత్యవసరంగా అంచనా వేయమని, కమిషనర్లు ఆదేశించారు.

విపత్తు సంభవించినప్పుడు, పీఠం రియాక్టర్‌కు మద్దతు ఇవ్వడంలో విఫలమైతే ఏం చేయాలో చెప్పాలని కూడా అథారిటీ అభ్యర్థించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube