ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్ గా సితార... ఎవరు తగ్గట్లేదుగా

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అయితే మహేష్ బాబు పిల్లలు గౌతమ్(Gautham) సితార(Sitara) కూడా అందరికీ ఎంతో సుపరిచితమే.మహేష్ బాబు గారాలపట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇంత చిన్న వయసులోనే ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి సితార ఒకవైపు చదువు కొనసాగిస్తూనే మరోవైపు సినిమాలపై తనకు ఉన్నటువంటి ఆసక్తిని ఎప్పటికప్పుడు బయట పెడుతూ ఉంటారు.

 Sitara Ghattamaneni To Bag A Major Jewellery Brand Contract Details,sitara, Mahe-TeluguStop.com

ఇంత చిన్న వయసులోనే ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్(Youtube Channel) రన్ చేయడమే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎన్నో డాన్స్ వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.

ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన విషయాలను అభిమానులతో పంచుకొని సితార త్వరలోనే సినిమాలలోకి కూడా రాబోతుందని తెలుస్తోంది.అయితే ఇంత చిన్న వయసులోనే సితారకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకున్నటువంటి ఒక ప్రముఖ నగల సమస్థ తమ నగలకు బ్రాండ్ అంబాసిడర్ (Jewellery Brand Contract) గా సితారను ఎంపిక చేసుకున్నారు.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన యాడ్ షూటింగ్ కూడా పూర్తి అయినట్టు తెలుస్తుంది.

ప్రత్యేక టెక్నీషియన్స్ సమక్షంలో ఈ యాడ్ దాదాపు మూడు రోజులపాటు షూట్ చేశారని సమాచారం.

ఇలా సితార ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని నగల సమస్థ ఈమెకు ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని కల్పించాలని తెలుస్తుంది.ఈ యాడ్ చేసినందుకుగాను సితారకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందినట్టు తెలుస్తుంది.ఇక ఈ యాడ్ త్వరలోనే టీవీలలో ప్రసారం కాబోతోంది.

ఇలా సితార కూడా నగల సమస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నారని తెలియడంతో మహేష్ బాబు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే మహేష్ ఫ్యామిలీలో ఇప్పటికే మహేష్ బాబు నమ్రత గౌతమ్ అందరూ కూడా పలు యాడ్స్ ద్వారా భారీగా సంపాదిస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే సితార కూడా యాడ్స్ చేస్తూ అదే బాటలో పయనిస్తుందని ఈ విషయంలో మహేష్ ఫ్యామిలీలో ఎవరు తగ్గడం లేదు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube