ఔటర్ రింగ్ రోడ్డు లీజ్ వ్యవహారంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు.నిబంధనలకు విరుద్ధంగా ఓఆర్ఆర్ టెండర్లు జరిగాయని ఆరోపించారు.
30 ఏళ్లకు టెండర్ ఎలా ఇస్తారో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.నెలలోపు పది శాతం నిధులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.
కానీ అలాంటి నిబంధన లేదని అధికారులు చెబుతున్నారని మండిపడ్డారు.నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వం ప్రజలను తప్పుడు సమాచారం అందిస్తుందని విమర్శించారు.







