సింగర్ చిన్మయి శ్రీపాద (Chinmayi sripada)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చిన్మయి గతంలో మీటు ఉద్యమం ద్వారా సంచలనంగా మారిన విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలోనే ఈమె రచయిత వైరముత్తు(Vairamuthu)పై ఆరోపణలు చేయడంతో ఏకంగా తమిళ చిత్ర పరిశ్రమ ఈమెని బ్యాన్ చేసిన విషయం మనకు తెలిసిందే.
ఇలా ఈ ఘటన నుంచి ఈమె మహిళల తరఫున పోరాటం చేస్తూ ఉన్నారు.అలాగే సమయం వచ్చిన ప్రతిసారి వైరుముత్తుపై విమర్శలు చేస్తూ వస్తుంటారు.

అయితే తాజాగా ఈ వ్యవహారం పై ఈమె నటుడు కమల్ హాసన్ (Kamal Hassan)ను సైతం ప్రశ్నిస్తూ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇండియన్ రెజ్లర్లు బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ పై లైంగిక ఆరోపణలు చేస్తూ న్యాయం కోసం కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే.అయితే వీరికి మద్దతుగా కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు.నేషనల్ గ్లోరీ కోసం పోరాడాల్సిన రెజ్లర్లు వ్యక్తిగత భద్రత కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది.
భారతీయులారా మన అటెన్షన్ కి ఎవరు అర్హులు ? క్రీడాకారులా లేక నేర చరిత్ర కలిగిన నేతలకా అంటూ కమల్ హాసన్ ట్వీట్ చేశారు.

ఇలా కమల్ హాసన్ ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ పై స్పందించిన సింగర్ చిన్మయి ఘాటుగా రిప్లై ఇచ్చారు.మహిళలపై వేధింపులకు పాల్పడిన వ్యక్తిని ప్రశ్నించినందుకు తమిళనాడులో గత ఐదు సంవత్సరాలుగా ఒక మహిళపై నిషేధం(Banned) విధించారు.ఈ ఘటన అందరి కళ్ళముందే జరిగిన కేవలం ఆ రచయితతో ఉన్న పరిచయం కారణంగా ఎవరు ఈ ఘటనపై నోరు విప్పలేదు.
తమ చుట్టూ ఇలాంటి ఘటనలు జరుగుతున్న పట్టించుకోకుండా మాట్లాడే రాజకీయ నాయకులను(Political Leaders) ఎలా నమ్మాలి అంటూ కమల్ హాసన్ చేసిన ట్వీట్ కి రిప్లై ఇస్తూ చిన్మయి చేసిన ఈ పోస్ట్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.








