బిఆర్‌ఎస్( BRS party ) బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy ) మరియు జూపల్లి కృష్ణరావు ఏ పార్టీలో చేరబోతున్నారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.అయితే ఎంతో తర్జన భర్జన తరువాత ఈ ఇద్దరు కాంగ్రెస్ లో చేరబోతున్నారనే వార్తలు బలంగా వినిపించాయి.
ఎందుకంటే ఏదైనా జాతీయ పార్టీలో చేరతానని పొంగులేటి గతంలో వ్యాఖ్యానించడం, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పొంగులేటి కోసం పోటాపోటి చర్చలు జరపడం వంటి పరిణామాల తరువాత కాంగ్రెస్ అనూహ్యంగా కర్నాటకలో విజయం సాధిచడంతో ఆయన కాంగ్రెస్ గూటికే చేరడం పక్కా అనే వాదన వినిపించింది.

పొంగులేటి కూడా కాంగ్రెస్ లోనే చేరబోతున్నట్లు పలు మార్లు హింట్ ఇచ్చారు కూడా.అయితే అనూహ్యంగా నిన్న పొంగులేటి, జూపల్లి కృష్ణరావు( Jupally Krishna Rao )లతో బీజేపీ చేరికల కమిటీ చైర్మెన్ ఈటల రాజేందర్ ( Etela Rajender )భేటీ కావడంతో సీన్ రివర్స్ అయింది.దాదాపు నాలుగు గంటలు ఆ ఇద్దరి నేతలతో ఈటెల చర్చలు జరిపినట్లు సమాచారం.
అయితే ఈ నాలుగు గంటల చర్చల తరువాత పొంగులేటి, జూపల్లి ఇద్దరు కూడా బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారని ఇన్ సైడ్ టాక్.ఈ చర్చలలలో పొంగులేటి, జూపల్లి కృష్ణరావు లకు అదిరిపోయే ఆఫర్లు ముందుంచినట్లు సమాచారం.

అంతేకాకుండా ఈటెల రాజేంద్ర తన చతురత ప్రదర్శించి నేతలను బీజేపీ వైపు తిప్పుకోవడంలో సక్సస్ అయ్యారని తెలుస్తోంది.ఇక మంచి సమయం చూసుకొని అధికారికంగా ఆ ఇద్దరు నేతలు కాషాయ కండువా కప్పుకొనున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ ఇద్దరి నేతలను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు హస్తం నేతలు కూడా గట్టిగానే ప్రయత్నించారు.కానీ నేతలను ఆకర్ర్షించడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య కావడంతో కాషాయ పార్టీ వ్యూహమే పై చేయి సాధించేలా కనిపిస్తోంది.
అయితే ఈ ఇద్దరు బిజెపిలో ఎప్పుడు చేరతారనే దానిపై క్లారిటీ లేనప్పటికి.పొంగులేటి, జూపల్లి కృష్ణరావు లను ఆకర్షించడంలో కాంగ్రెస్ విఫలం అయితే బీజేపీ సఫలం అయినట్లే కనిపిస్తోంది.







