అమెరికా తాజా నిర్ణయం మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలకనుందా?

చాలా మంది ప్రపంచ మేధావులకు ఇపుడు మూడో ప్రపంచ యుద్దం( World War III ) ఘడియలపై పలు అనుమానాలు వస్తున్నాయి.దానికి మొదట కారణం గత 15 నెలలుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం( Russia Ukraine War ) అని చెప్పుకోవచ్చు.

 America About Supplying F-16 Jets To Ukraine Details, Telugu Nri, Latest News, V-TeluguStop.com

ఇన్నాళ్లుగా యుద్ధం సాగుతుంటే అగ్రరాజ్యం అమెరికా( America ) చోద్యం చూస్తూ ఉక్రెయిన్ కు ఆయుధాలను సరఫరా చేస్తుందే తప్ప, ఎక్కడా ఆ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం మాత్రం చేయడం లేదు.

అయితే ఇక్కడ కొసమెరుపు ఏమంటే, ఎన్ని ఆయుధాలు సరఫరా చేసినా.ఉక్రెయిన్ యుద్దంలో ఇన్ని రోజులుగా అడుగుతున్న ఎప్ 16 విమానాలను మాత్రం అమెరికా ఇంకా వారికి సరఫరా చేయలేదు.కానీ జీ7 దేశాల సమావేశాల అనంతరం అమెరికా ఇవ్వకుండా నాటో దేశాలు వాటిని ఇచ్చేలా ప్రేరేపిస్తోంది.

ఇటలీ, జర్మనీ లాంటి దేశాలు ఎప్ 16 యుద్ధ విమానాలను ఉక్రెయిన్ కి ఇవ్వాలని గట్టిగా పట్టు బడుతోంది.అయితే వాటితో రష్యా లోపలికి వెళ్లి మాత్రం యుద్దం చేయొద్దని సూచిస్తోంది.

ఇలాంటి కొన్ని పరిణామాలను విశ్లేషించి, మేధావి వర్గం ఏమంటున్నారంటే… అమెరికా ధోరణి మొదటినుండి మార్చుకోవడం లేదు, తమవద్దనున్న యుద్ధ సామాగ్రిని సొమ్ముచేసుకోవడంలో వున్న ఆనందం, యుద్ధాన్ని ఆపడానికి లేదని… ఆరోపిస్తున్నారు.పెద్దన్న అమెరికా ఇదే ధోరణి కనబరిస్తే అత్యంత త్వరలోనే మూడవ ప్రపంచ యుద్ధం జరిగే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.కాబట్టి వీలైనంత తొందరగా ప్రపంచ దేశాలు రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు.లేదంటే దీని ఫలితం రాబోయే రోజుల్లో ప్రతి దేశంపై పడే అవకాశం ఉంటుందని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube