టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కక్ష పూరితంగా సుప్రీంకోర్టుకు వెళ్లి ప్రాజెక్టు నిర్మాణాలపై చంద్రబాబు స్టే తెచ్చారని మండిపడ్డారు.
పుంగనూరు, తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాల్లో తాగునీరు మరియు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో మూడు రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టినట్టు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.ఇందులో ఇప్పటికే రెండు రిజర్వాయర్ల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి అయ్యాయన్నారు.
ప్రాజెక్టులు పూర్తయితే రైతులకు, ప్రతి ఇంటికి నీరు అందుతుందని చెప్పారు.చంద్రబాబు చేసే కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు చిత్తూరు జిల్లాలో డిపాజిట్లు కూడా రావని తెలిపారు.ఎంత అభివృద్ధి చేసినా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయన్న ఆయన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి వారికి కనపడదని విమర్శించారు.







