నటన మీద ఆసక్తి ఉన్నవాళ్లు ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.ఎంతో కష్టపడుతూ ఉంటారు.
కొన్ని కొన్ని సార్లు తమకి ఇష్టమైనవి కూడా త్యాగాలు చేస్తూ ఉంటారు.ఎందుకంటే నటన మీద అంత ఆసక్తి ఉంటుంది కాబట్టి.
అంతే కానీ ఎటువంటి కష్టాలు లేకుండా, ఎటువంటి ప్రయత్నాలు లేకుండా ఊరికే నటులుగా పరిచయం కారని చెప్పాలి.ఇప్పటికే ఎంతోమంది నటీనటులు అడ్డంకులు, త్యాగాలు వంటివి దాటి అడుగుపెట్టారు.
అందులో ఒకరు శ్రీలీల అని కూడా చెప్పాలి.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది బ్యూటీగా శ్రీలీల( Sreeleela ) ఉందని చెప్పాలి.
స్టార్ దర్శకులు, స్టార్ హీరోలు, చిన్న హీరోలు సైతం తమ సినిమాలకు శ్రీలీలనే ఎంచుకుంటున్నారు.అందుకే ఈ అమ్మడు ఖాతాలో ప్రస్తుతం వరుసగా 12 సినిమాలు ఉన్నాయని చెప్పాలి.
అసలు ఇండస్ట్రీకి అడుగు పెట్టిన తొలినాళ్లలో వరుసగా ఇన్ని సినిమాలు వచ్చాయంటే అది మామూలు విషయం కాదని చెప్పాలి.ఎంతైనా శ్రీలీలకు టాలీవుడ్ ఇండస్ట్రీ బాగా కలిసి వచ్చిందని చెప్పాలి.

చూడ్డానికి ఈ ముద్దుగుమ్మ అందంగా ఉండటమే కాకుండా.తన ఎక్స్ప్రెషన్స్ తో, డాన్స్ స్టెప్పులతో, నటనతో ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది.ఆ మధ్య విడుదలైన ధమాకా సినిమాలో ఈ అమ్మడు డాన్స్, పర్ఫామెన్స్ చూసి చాలామంది పడిపోయారు.అలా ధమాకా సినిమా( Dhamaka) తర్వాత ఈ బ్యూటీ కి వెంట వెంటనే అవకాశాలు వచ్చాయి.
ప్రస్తుతం బాలయ్య, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నితిన్ ల సినిమాలతో బిజీగా ఉండగా రీసెంట్గా విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) వైష్ణవ్ తేజ్ లతో కూడా సినిమా చేయడానికి సిద్ధమైంది.ఇక ఇవే కాకుండా మరిన్ని సినిమాలు కూడా ఉన్నాయి ఈ అమ్మడి ఖాతాలో.

ఈ బ్యూటీ ని చూసి హీరోయిన్స్ కూడా బాగా కుళ్ళు కుంటున్నారని చెప్పాలి.వాళ్లకు వచ్చే అవకాశాలు కూడా ఈ ముద్దుగుమ్మ లాగేసుకోవడంతో కాస్త కోపంగానే ఉన్నారని చెప్పాలి.అయితే ఇండస్ట్రీకి అడుగు పెట్టిన తొలినాళ్లలోనే ఇన్ని సినిమాలు చేయటం.అదికూడా స్టార్ హీరోలతో చేయటం అంటే గతంలో ఆమె ఎంత కష్టపడిందో అర్థమవుతుంది.

ఆమెకు చిన్నప్పటినుంచే హీరోయిన్ గా చేయాలన్న కోరిక బాగా ఉండేదట.దాంతో ఎంతో కష్టపడి నటన నేర్చుకుందట.ఇక చదువుకునే వయసులోనే ఒకపక్క చదువు, మరోపక్క స్పోర్ట్స్ తో పాటు యాక్టింగ్ నేర్చుకుందట.అలా తీరిక లేకుండా కష్టపడ్డా ఈ ముద్దుగుమ్మ.చిన్నప్పుడు చేయాల్సిన ఎంజాయ్ లను త్యాగం చేసి.ఇప్పుడు ఇలా అవకాశాలు అందుకుంటుందని అంటున్నారు.
చిన్నప్పుడు తల్లిదండ్రులతో కూడా చాలా తక్కువ సమయం గడిపేదట.తన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం అన్ని వదులుకొని ఈ స్థాయికి చేరుకుందని తెలిసింది.
అప్పుడు అంత కష్టపడింది కాబట్టి ఇప్పుడు దానికి తగ్గ ప్రతిఫలం అందుకుంటుంది అని అంటున్నారు తన అభిమానులు.ఏదేమైనా ఇప్పుడైతే టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీ లీల పేరు మారుమ్రోగుతుందని చెప్పాలి.







