నరేష్ (Naresh) పవిత్ర లోకేష్(Pavitra Lokesh) ప్రస్తుతం రిలేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే.ఇక ప్రస్తుతం వీరిద్దరూ జంటగా మళ్లీ పెళ్లి (Malli pelli)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా మే 26వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పవిత్ర లోకేష్ నరేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా నరేష్ గురించి ఎన్నో విషయాలను తెలియజేసిన ఈమె నరేష్ లో తనకు నచ్చిన క్వాలిటీ కూడా బయటపెట్టారు.
సాధారణంగా తాను ఏ చిన్న ఘటన జరిగిన చాలా తొందరగా ఆవేశ పడతానని ఆ విషయం గురించి పదేపదే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటానని పవిత్ర తెలిపారు.
కానీ నరేష్ గారు అలా కాదు ఆయన రేపటి గురించి అసలు ఆలోచించరని తెలిపారు.రేపు అనేది వస్తే తప్పకుండా ఆలోచిద్దామనే వ్యక్తిత్వం కలవారని అలాగే ఏ విషయానికి తొందరగా కోపంతో రియాక్ట్ అవ్వరని,ఈరోజు మనకు ఉన్నదాంట్లో సంతోష పడదాం అనుకొనే రకం నరేష్ గారు తనలో నాకు ఈ క్వాలిటీ బాగా నచ్చిందని పవిత్ర లోకేష్ తెలియజేశారు.

ఇక అన్నిటికంటే ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారని దీనికన్నా నాకు మరి ఏది అవసరం లేదు అంటూ ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ నరేష్ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక మళ్లీ పెళ్లి అనే సినిమాని నరేష్ జీవిత కథ ఆధారంగా చేశారని భావిస్తున్నప్పటికీ నరేష్ మాత్రం లేదనే సమాధానం చెబుతున్నారు కానీ ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ట్రైలర్ చూస్తే మాత్రం సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.మరి ఈ సినిమాని నరేష్ స్వయంగా నిర్మించిన విషయం మనకు తెలిసిందే.







