తక్కువ ధరకే లభిస్తున్న అద్భుతమైన ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

పెట్రోల్, డీజిల్ ధరలు దారుణంగా ఉండడంతో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే చాలామంది ఎలక్ట్రిక్ వెహికల్స్( Electric Vehicles ) వైపు దారి మళ్లారు.

 Best Affordable Electric Cars In India Details, Technology Updates, Technology-TeluguStop.com

మీరు కూడా ఎలక్ట్రిక్ కారుని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే మీకు ఓ శుభవార్త.ప్రస్తుతం మార్కెట్‌లో పలు మోడళ్లు అందుబాటు ధరలోనే లభిస్తున్నాయి.

ఈ లిస్టులో మొదట ‘ఎంజీ కామెట్ కారు’ ( MG Comet ) గురించి మాట్లాడుకోవాలి.ఈ కారు చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది.

ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే 230 కిలోమీటర్లు మేర పయనిస్తుంది.కాగా దీని ప్రారంభ ధర రూ.7.98 లక్షలుగా ఉంది.

Telugu Afdableelectric, Citreon, Electric Cars, Mgcomet, Nexon Ev, Tata Tigor Ev

తరువాత ‘సిట్రోయెన్ సీ3’( Citreon C3 ) ఎలక్ట్రిక్ కారు గురించి మాట్లాడుకోవాలి.టాటా టియాగో ఈవీకి పోటీగా ఈ కారు మార్కెట్‌లోకి దిగిందని చెప్పుకోవాలి.దీని ధర రూ.11.5 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది.ఒక్కసారి చార్జింగ్ పెడితే ఈ కారు ఏకంగా 320 కిలోమీటర్లు పయనిస్తుందని చెబుతున్నారు.

ఇక ‘నెక్సన్ ఈవీ’ ( Nexon EV ) కూడా బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కార్ల లిస్టులో వుంది.ఈవీ మార్కెట్‌లో జనాలు ఎక్కువగా కొంటున్న కారు ఇదే.ఇందులో 30.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది.దీని రేంజ్ 312 కిలోమీటర్లు.దీని ధర రూ.14.19 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది.

Telugu Afdableelectric, Citreon, Electric Cars, Mgcomet, Nexon Ev, Tata Tigor Ev

ఆ తరువాత ‘టాటా టిగోర్’( TATA Tigor EV ) కారు గురించి మాట్లాడుకోవాలి.ఈ కారు ధర రూ.12.49 లక్షల నుంచి ప్రారంభం కాగా ఒక్కసారి చార్జ్ చేస్తే ఈ కారు 315 కిలోమీటర్లు మేర వెళ్తుంది.అలాగే ‘టాటా టియాగో ఈవీ’ రెండో ప్లేస్‌లో ఉంది.ఈ కారు ధర రూ.8.69 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది.ఒక్కసారి చార్జ్ చేస్తే 315 కిలోమీటర్ల వరకు పయనిస్తుంది.మీరు అందుబాటు ధరలోనే కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తే వీటిల్లో మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు.

రానున్న కాలంలో ‘రెనో క్విడ్’ మోడల్‌లో కూడా ఎలక్ట్రిక్ కారు రానుంది.అలాగే నానో ఎలక్ట్రిక్ కారు కూడా రావొచ్చనే అంచనాలు నెలకొన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube