మనీలాండరింగ్ కేసులో మండోలి జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ మరో లేఖ రాశారు.ఈ సారి మీడియా, సోషల్ మీడియాకు ఆయన లేఖ రాశారని తెలుస్తోంది.
ఈ మేరకు సుఖేశ్ చంద్రశేఖర్ లేఖను ఆయన న్యాయవాది అనంత్ మాలిక్ మీడియాకు విడుదల చేశారు.అయితే ఈ లేఖలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గురించి ప్రస్తావించారు.కవిత షెల్ ఖాతాల నుంచి మంత్రి కైలాశ్ ఘెలోట్ సోదరులు ‘గ్రీన్ హస్క్’ ఇండస్ట్రీస్ మారిషస్ ఖాతాలకు రూ.80 కోట్లు బదిలీ అయినట్లు పేర్కొన్నారు.ఈ మేరకు బదిలీకి సంబంధించి ఫేస్ టైమ్ చాట్ ల స్క్రీన్ షాట్లు విడుదల చేస్తానని తెలిపారు.కేజ్రీవాల్ సూచనల మేరకు రూ.80 కోట్లు బదిలీ చేశానని వెల్లడించారు.త్వరలోనే కేజ్రీవాల్ ఫేస్ టైమ్ చాట్ ల స్క్రీన్ షాట్లు విడుదల చేస్తానంటూ మీడియాకు రాసిన లేఖలో వెల్లడించారు.







