ఇంటర్‌నెట్‌లో అనునిత్యం అనేకరకాల వీడియోలు సందడి చేస్తూ ఉంటాయి.అందులో కొన్ని వీడియోలు మనకు నవ్వు తెప్పిస్తే, మరికొన్ని వీడియోలు ఆశ్చర్యంగానూ, మరికొన్ని విచిత్రంగాను ఉంటాయి.
అయితే అప్పుడప్పుడు మనసును తేలికపరిచే వీడియోలు, హృదయాన్ని తాకే వీడియోలు అరుదుగా కనిపిస్తాయి.అవును, ఓ చిరువ్యాపారి పేదరికాన్ని ( Poverty ) కండ్లకు కట్టే వీడియో ఇప్పుడు అందరి హృదయాలను కదిలిస్తోంది.

అవును, మన చుట్టూ ఎంతోమంది జనులు ఎన్నో ప్రయాసలు పడి కూడా కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితిలో వున్నారని ఈ వీడియో కండ్లకు కట్టినట్టు కడుతుంది.ఆన్‌లైన్ బ్లాగర్( Online Blogger ) సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో ఫ్లూట్ సెల్లర్( Flute Seller ) ఆవేదన అందరినీ కలచివేస్తోంది.రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఫ్లూట్ సెల్లర్‌ను బ్లాగర్ కలుసుకోగా అతడితో మాట్లాడుతూ ఉద్వేగానికి గురయ్యాడు ఆ చిరువ్యాపారి.అతని కంటనీరు చూసి నెటిజన్ల మనసు ద్రవిస్తోంది.

ఇకపోతే, ఇలాంటి పేదరికం భారదేశం అంతటా వ్యాపించి వుంది.అలాగని ఇక్కడ ధనికులకు కూడా కొదువలేదు.అడ్డగోలుగా తరాలు తరాలకి కొంతమంది ఇక్కడ సంపాదిస్తూ వుంటారు.క్షణం పని చేయకుండా ఖాళీగా ఉంటూనే అడ్డ దార్లలో సంపాదిస్తూ కార్లలో తిరుగుతూ పెద్ద మనుషులుగా చలామణీ అవుతూ వుంటారు.
మరికొంతమంది పుట తిండికి తిండిలేక, కట్టుకోవడానికి బట్టలేక చాలా ఇబ్బందులకు గురవుతూ వుంటారు.ఇలాంటి ఫ్లూట్ సెల్లర్స్ ఇక్కడ ఎంతమందో వున్నారు.వారి గోడు ఎవరికీ పట్టదు.ఇక్కడ పూట తిండికి గతిలేక కొందరు ఏడుస్తుంటే తిన్నది అరక్క ఎంతోమంది ఏడుస్తూ వుంటారు.






