కర్నాటక ఎన్నికల తరువాత తెలంగాణ బీజేపీ( BJP ) నేతలు కొంత డీలా పడ్డారనేది వాస్తవం.అంతకుముందు చురుకుగా పార్టీ కార్యక్రమాలు చేపడుతూ, ప్రత్యర్థి పార్టీ పై విమర్శలు గుప్పిస్తు పోలిటికల్ హీట్ పెంచే కమలనాథులు.
కర్నాటక ఎన్నికల ఫలితాల తరువాత సైలెంట్ అయ్యారు.అసలు లోటుపాట్లను చెక్ చేసుకునే పనిలో ఉన్నారు.
కర్నాటక ఫలితాలు తెలంగాణలో రిపీట్ కాకూడదంటే పక్కా వ్యూహరచనతో ముందుకు పోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.ఈ నేపథ్యంలోనే పార్టీ పునః ప్రక్షాళనపై అధిష్టానం దృష్టి పెట్టిందని, త్వరలో అధ్యక్ష పదవి మార్పు ఉంటుందని రకరకాల వార్తలు చెక్కర్లుకొట్టాయి.

ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ( Bandi Sanjay )కొనసాగుతున్నారు.ఆయన అధ్యక్షపదవి చేపట్టినది మొదలుకొని రాష్ట్రంలో బీజేపీ బలపడుతూ వచ్చింది.గత ఎన్నికల్లో కేవలం 4 సీట్లకే పరిమితమైన కాషాయ పార్టీ.ప్రస్తుతం బిఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయంగా మరెంత బలపడిందంటే దానికి కారణం బండి సంజయ్ నాయకత్వమని డిల్లీ పెద్దలలో ఉన్న భావన.
అందుకే బండి పై ప్రత్యక అభిమానాన్ని కనబరుస్తూ వచ్చారు బీజేపీ పెద్దలు.అయితే కొన్ని సార్లు బండి చేసే వ్యాఖ్యలు బీజేపీని కొంత ఇరకాటం లో పడేస్తున్నాయి.
దీంతో బండి అధ్యక్ష మార్పు పై గతంలో కూడా చర్చ జరిగినప్పటికి.ఈ ఎన్నికల వరకు బండినే కొనసాగించాలని అధిష్టానం భావించింది.

అయితే కర్నాటక ఎన్నికల( Karnataka Elections ) తరువాత అధిష్టానం కొత్త వ్యూహాలకు పదును పెడుతోందని, అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని తప్పించి ఈటెల రాజేందర్ అప్పగించేలా కసరత్తులు జరుగుతున్నాయని పోలిటికల్ సర్కిల్స్ లో వార్తలు వైరల్ అయ్యాయి.డిల్లీ పెద్దలు కూడా ఈటెల రాజేంద్రతో ప్రత్యేకంగా బేటీ కావడంతో ఈ నిజమేనేమో అని అనుకున్నారంతా.అయితే ఈ ఎన్నికల వరకు అధ్యక్ష పదవిలో బండిసంజయ్ నే కొనసాగించాలని భావించిన కేంద్రం అదే నిర్ణయానికి కట్టుబడి ఉందట.సాధారణంగా మూడేళ్లకు ఒకసారి అధ్యక్షపదవి మార్పు ఉంటుంది.
రాష్ట్రంలో బండి సంజయ్ పార్టీని బలపరిచిన తీరుతో ఇంప్రెస్ అయిన డిల్లీ పెద్దలు మరో మూడేళ్లు బండి సంజయ్ నే పదవిలో ఉంచాలని భావిస్తున్నారట.అది కాక ఎన్నికల ముందు అధ్యక్ష పదవిలో మార్పు వస్తే ఆ ప్రభావం పార్టీపై గట్టిగా పడే అవకాశం ఉంది.
ఇవన్నీ ఆలోచించిన బీజేపీ అధిష్టానం బండి సంజయ్ కి ఫ్రీ హ్యాండ్ ఇస్తూ ఎన్నికలకు వెళ్లాలనే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.







