మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని( Madhya Pradesh ) ఇండోర్‌కు చెందిన ‘స్వస్తి వాఘ్’( Swasti Wagh ) తనకు వచ్చిన అరుదైన వ్యాధి గురించి తాజాగా ఓ మీడియా వేదికగా చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యారు.ఆమె నడకను చూసిన జనాలు మద్యం తాగినట్టు నడుస్తోందని కామెంట్స్ చేసేవారట.
ఆ మాటలు ఆమె మనసుకి బాణాల్లా తగిలేవట.ఎందుకంటే నిజానికి ఆమెకి తాగుడు వంటి దురలవాట్లు ఏమీ లేవట.
ఆమెకు వున్న అటాక్సియా అనే నాడీ సంబంధిత కండరాల క్షీణత సమస్య కారణంగానే ఆ సమస్య వచ్చిందని ఆమెని అపరిశీలించిన డాక్టర్లు నిర్ధారించారు.

స్వస్తి వాఘ్‌కు ఈ వ్యాధి ఉన్నట్లు 18 ఏళ్ల వయసులో తెలిసింది.14 ఏళ్ల వయస్సులోనే ఆమెను ”నీ నడక తేడాగా ఉంది ఏంటి?” అని చాలామంది అడిగేవారట.దాంతో ఆమె చాలా మానసిక వ్యాధిని అనుభవించేదాన్నని చెప్పుకొచ్చింది.
స్వస్తి వాఘ్ తన వ్యాధి గురించి మాట్లాడుతూ మొదట్లో నడవడానికి ఇబ్బంది రావడంతో గుంపులో నడవాలంటే భయం వేసేదట.అలా 11-12 తరగతిలో నడుస్తూ హఠాత్తుగా పడిపోయేదట.
దీంతో ఆమె ముంబైలోని ఒక వైద్యుడికి కలవగా ఆయన న్యూరాలజిస్ట్‌ని కలవమని సూచించారట.అప్పుడే అటాక్సియా అని తెలిసిందని చెప్పుకొచ్చింది.

ఈ క్రమంలో ఆమె అదే వ్యాధి కలిగిన భారతదేశంలోనే కొంతమంది రోగుల గురించి విని వారి గ్రూప్‌లో చేరిందట.చివరికి ఆమె అలా ఓ అటాక్సియా అవేర్‌నెస్ సొసైటీని( Ataxia Awareness Society ) స్టార్ట్ చేసింది.ఇపుడు ఆమె ఈ వ్యాధి కలిగిన మనుషులకు కౌన్సిలింగ్ ఇస్తోంది.ఒంటికాలితో జీవితాన్ని ఎలా ఈదాలో నేర్పుతోందట.అవును, ఆమె ఇపుడు అటాక్సియా వ్యాధి గురించి అనేక వివరాలు సేకరించి బాధితులలో ధైర్యం నింపుతోంది.వారికి కొండంత భరోసా ఇస్తోంది.
అటాక్సియాకు చికిత్స లేదని, అయితే దాని లక్షణాలకు చికిత్స చేయడం ద్వారా బాధితుల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చని ఆమె చెబుతోంది.వీటిలో స్పీచ్, లాంగ్వేజ్ థెరపీ, కదలికలకు సహాయపడే ఫిజియోథెరపీ, కండరాలు, మూత్రాశయం, గుండె, కళ్ల సమస్యలు వంటివి తీవ్రంగా మారకుండా నిరోధించవచ్చని చేబుతోంది.







