బుల్లితెర యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి వారిలో యాంకర్ వర్షిని(Varshini) ఒకరు.బుల్లితెర కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి ఈమె ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటూ వరుస సినిమాలలో నటించే అవకాశాలను అందుకుంటు బిజీగా ఉన్నారు.
ఇలా సినిమాలలో హీరోయిన్ గా కాకుండా ఇతర కీలక పాత్రలలో వర్షిని నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇలా తన కెరియర్ విషయం పక్కన పెడితే వ్యక్తిగత విషయాల వల్ల వర్షిని పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్న విషయం మనకు తెలిసిందే ఈమధ్య కాలంలో ఈమె ఎప్పుడు చూసిన క్రికెట్ స్టేడియం ( Cricket Stadium) లోనే మనకు దర్శనమిస్తున్నారు.

ఈ మధ్యకాలంలో వర్షిని సన్ రైజర్స్ హైదరాబాద్ టీంను ఎంకరేజ్ చేస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.అయితే వర్షిని ప్రముఖ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ ( Washington Sunder) తో ప్రేమలో ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఈ వార్తలకు అనుగుణంగానే వీరి వ్యవహార శైలి కూడా ఉండడంతో ఇది నిజమేనని అందరూ భావిస్తున్నారు.ఈ వద్దకాలంలో హైదరాబాద్ కి ఆల్రౌండర్ గా ఉన్న సుందర్ నాలుగు మ్యాచ్లు మాత్రమే ఆడి గాయం కారణంగా బయటకు వెళ్లిపోయిన విషయం మనకు తెలిసిందే.
అంతే కాకుండా ఈయన క్రికెట్ రూల్స్ బ్రేక్ చేస్తూ యాంకర్ వర్షినితో కలిసి బయటకు వెళ్లినట్టు తెలుస్తుంది అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.

ఇలా వర్షిని సుందర్ తో ప్రేమలో ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.అయితే ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో గతంలో వర్షిని జాతకం గురించి వేణు స్వామి (Venu Swamy) చేసినటువంటి కామెంట్స్ ను నేటిజన్స్ గుర్తు చేసుకుంటున్నారు.గతంలో వేణు స్వామి యాంకర్ వర్షిని గురించి మాట్లాడుతూ … ఈమెకు చాలా మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు.
ఢీ కార్యక్రమం నుంచి ఈమెను తొలగించి మంచి పని చేశారని, ఈమె అనసూయ(Anasuya) కన్నా ఎంతో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంటుందంటూ గతంలో వేణు స్వామి కామెంట్ చేశారు.అయితే ప్రస్తుతం ఈమె క్రికెటర్ తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇదే కనుక నిజమైతే ఈమె ఒక క్రికెటర్ కు భార్య అవుతుందని, ఒక క్రికెటర్ భార్యకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.ఇదే కనుక నిజమైతే వేణు స్వామి మాటలు మరోసారి నిజం కాబోతున్నాయి అంటూ పెద్ద ఎత్తున ఈ విషయం గురించి చర్చలు జరుపుతున్నారు.







