యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి( NTR Rajamouli ) కాంబినేషన్ లో తెరకెక్కిన సింహాద్రి మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించిన సంగతి తెలిసిందే.రీ రిలీజ్ లో 1000 స్క్రీన్లలో రిలీజ్ కాగా తొలిరోజే 5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో రోజు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను అందుకుంది.
సింహాద్రి రీరిలీజ్( Simhadri Rerelease ) లో ఈ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడానికి ఎన్టీఆర్ కారణమని సమాచారం.
సింహాద్రి సినిమాకు సంబంధించి ప్రత్యక్షంగా ఎన్టీఆర్ ఎక్కడా కనిపించకపోయినా పరోక్షంగా సినిమా రీ రిలీజ్ లో సక్సెస్ సాధించడానికి ఎంతో కష్టపడ్డారని సమచారం.
ఎన్టీఆర్ కష్టం వృథా పోలేదని రీ రిలీజ్ లో ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు సొంతమయ్యాయని సమాచారం.మరోవైపు సింహాద్రి మూవీ రీరిలీజ్ కలెక్షన్లు ఫేక్ అని కొంతమంది కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ కామెంట్లకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమదైన శైలిలో సమాధానం ఇచ్చారు.జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )తన సినీ కెరీర్ లో ఎప్పుడూ ఫేక్ కలెక్షన్లను ప్రచారంలోకి తీసుకురాలేదని వెల్లడిస్తున్నారు.ఎన్టీఆర్ కు అలాంటి అవసరం లేదని గ్లోబల్ స్టార్ అయిన ఎన్టీఆర్ నిజాయితీగా వ్యవహరిస్తారని ఫ్యాన్స్ చెబుతున్నారు.ఎన్టీఆర్ పై అనవసరంగా విమర్శలు చేయవద్దని అభిమానులు కోరుతున్నారు.
ఏ హీరో రికార్డులు శాశ్వతం కావని సింహాద్రి డే1 భారీగా కలెక్షన్లను సాధించినంత మాత్రాన ఈ సినిమాపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.తారక్ తర్వాత సినిమాలు సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర( Devara ) సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది.వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమా రిలీజ్ కానుందనే సంగతి తెలిసిందే.