తాజాగా లక్నో- కోల్ కత్తా( Lucknow- Kolkatta ) మధ్య జరిగిన మ్యాచ్లో లక్నో ఒక్క పరుగు తేడాతో గెలిచి ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంది.ఈ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది.
ఆఖరి ఓవర్లో రింకూ సింగ్ బ్యాటింగ్ చేయడంతో దాదాపుగా లక్నో మ్యాచ్ ఓడిపోతుందని అందరూ భావించారు.కానీ విజయం లక్నోను వరించింది.
దీంతో లక్నో వరుసగా రెండో ఏడాది టాప్ – 4 లో నిలిచి సత్తా చాటింది.

లక్నో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది.నికోలస్ పూరన్( Nicholas Pooran ) అర్థ సెంచరీ చేయడంతో లక్నో జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగుల మెరుగైన స్కోర్ చేసింది.తరువాత లక్ష్య చేదనకు దిగిన కోల్ కత్తా ఓపెనర్స్ జేసన్ రాయ్ 45 పరుగులతో, వెంకటేష్ అయ్యర్ ( Venkatesh Iyer )24 పరుగులతో అద్భుత ఆరంభం అందించారు.
ఇక కోల్ కత్తా గెలుపు కాయం అని అనుకుంటే, కెప్టెన్ నితీష్ రాణా 8, రహ్మనుల్లా గుర్బాజ్ 10 పరుగులు చేసి అవుట్ అవ్వడంతో జట్టు కష్టాల్లో పడింది.ఇక మిగతా బ్యాటర్లు కూడా చెప్పుకోదగ్గ స్కోరు నమోదు చేయలేదు.

ఇక ఐదు స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన రింకూ సింగ్ చివరి వరకు చేసిన పోరాటం ఒక్క పరుగు తేడాతో వృధా అయ్యింది.ఒకవైపు వరుసగా వికెట్లు కోల్పోతున్న మరొకవైపు బౌండరీలు బాదుతూ అద్భుత ఆటను ప్రదర్శించాడు.ఇక చివరి ఓవర్ లో 21 పరుగులు చేయాల్సి ఉండగా లక్నో బౌలర్ యశ్ ఠాగూర్( Yash Tagore ) కాస్త ఒత్తిడికి లోనయ్యాడు.మొదటి బంతికి ఒక పరుగు రాగా, రెండో బంతికి వైడ్ వెళ్ళింది.
ఆ తర్వాత రెండు బంతులలో ఎటువంటి పరుగులు రాలేదు.ఇక మూడు బంతులకు 18 పరుగులు చేయాల్సి ఉండగా, రింకూ సింగ్ సిక్స్, ఫోర్, సిక్స్ కొట్టాడు.
కేవలం ఇంకా రెండు పరుగులు చేసి ఉంటే కోల్ కత్తా విజయం సాధించేది.కానీ ఒక్క పరుగు తేడా ఉండడంతో లక్నో ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంది.
కోల్ కత్తా ఓడినప్పటికీ రింకూ సింగ్ మాత్రం అందరి ప్రశంసలు పొందుతున్నాడు.







