మెగా హీరోలకు హిట్లు ఇచ్చి జూనియర్ ఎన్టీఆర్ కు ఫ్లాపులిచ్చిన స్టార్ డైరెక్టర్లు వీళ్లే!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr ntr 0 టాలీవుడ్ టాలెంటెడ్ హీరోలలో ఒకరు కాగా ఈ హీరో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది టాలెంటెడ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చారు.అయితే కొంతమంది డైరెక్టర్లు జూనియర్ ఎన్టీఆర్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటే మరి కొందరు డైరెక్టర్లు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ నమ్మకాన్ని వమ్ము చేశారని చెప్పాలి.

 These Directors Gave Flop To Junior Ntr Details Here Goes Viral , Directors ,-TeluguStop.com

ఈతరం డైరెక్టర్లలో ఎన్టీఆర్ నమ్మకాన్ని వమ్ము చేసిన డైరెక్టర్ల జాబితాలో సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్ ఉంటారు.

ఎన్టీఆర్ సురేందర్( Surender Reddy ) రెడ్డి కాంబినేషన్ లో అశోక్, ఊసరవెల్లి సినిమాలు వచ్చాయి.

దాదాపుగా ఐదేళ్ల గ్యాప్ తో ఈ రెండు సినిమాలు థియేటర్లలో విడుదల కావడం జరిగింది.అయితే ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు.సురేందర్ రెడ్డి ఎన్టీఆర్ తో తీసిన సినిమాలలో ఫస్టాఫ్ బాగుంటే సెకండాఫ్ బాలేకపోవడం గమనార్హం.ఈ రీజన్ వల్లే ఎన్టీఆర్ సురేందర్ రెడ్డి కాంబో ఫ్లాప్ కాంబోగా మిగిలింది.

Telugu Directors, Ntr, Pawan Klayan, Ram Charan, Samantha, Surender Reddy, Tolly

అయితే మెగా హీరోలలో ఒకరైన రామ్ చరణ్ తో సురేందర్ రెడ్డి ధృవ సినిమాను తెరకెక్కించగా చిరంజీవితో సైరా నరసింహారెడ్డి సినిమాను బన్నీతో రేసుగుర్రం సినిమాను తెరకెక్కించారు.ఈ మూడు సినిమాలు కమర్షియల్ గా సైతం సక్సెస్ ను సొంతం చేసుకోవడం జరిగింది.ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రామయ్యా వస్తావయ్యా( Ramayya Vasthavayya ) మూవీ తెరకెక్కింది.ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేదు.

Telugu Directors, Ntr, Pawan Klayan, Ram Charan, Samantha, Surender Reddy, Tolly

అయితే హరీష్ శంకర్( Harish Shanka ) పవన్ తో తీసిన గబ్బర్ సింగ్, బన్నీతో తీసిన డీజే, వరుణ్ తేజ్ తో తీసిన గద్దలకొండ గణేష్ సినిమాలు హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి.హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.మెగా హీరోలకు హిట్లు ఇచ్చిన సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్ ఎన్టీఆర్ కు మాత్రం ఫ్లాపులివ్వడం ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube