తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నటి,యాంకర్ హరితేజ( Hariteja ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె బుల్లితెరపై, వెండితెరపై నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.
కాగా ఈమె మొదట బుల్లితెర పై పలు సీరియల్స్ లో కూడా నటించిన విషయం తెలిసిందే.అంతే కాకుండా బిగ్ బాస్ షో కి ( Bigg Boss ) ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకుంది.
కాగా ఈమె గత ఏడాది ఏప్రిల్ లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం అందరికి తెలిసిందే.అంతేకాకుండా ఆ పాపకు బారసాల నిర్వహించి భూమి దీపక్ రావు అని పేరు నామకరణం చేశారు.

ప్రస్తుతం హరితేజ అడప దడపా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఇకపోతే హరితేజ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు తన కూతురుకి సంబంధించిన వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది.అలాగే తన భర్త దీపక్ రావు( Deepak Rao ) తన పాపను ఆడుతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో పంచుకుంటు ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా హరితేజ కు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కాగా ఆ ఫోటోలలో హరితేజ స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తూ బికినీలో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

అందుకు సంబందించిన కొన్ని ఫొటోలని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.అయితే హరితేజని ఆ ఫోటోలలో చూసిన నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు.కాగా నిన్న మొన్నటి దాకా బాగానే ఉన్నావ్ కదా? ఇప్పుడేంటి ఇలా తయారయ్యావ్ అంటూ నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.కొందరు మాత్రం పాజిటివ్గా స్పందిస్తున్నారు.కాగా కొందరు నెటిజన్స్ ఎప్పుడు హరితేజని పద్దతిగా చూసి ఇలా ఒక్కసారిగా బికినీలో చూసేసరికి షాక్ అయ్యారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి
.






