మాములుగా ఒక సినిమాను తెరకెక్కిస్తున్నప్పుడు దర్శక నిర్మాతలపై అలాగే హీరోపై ఒత్తిడి అన్నది ఉంటుంది.అలాగే ఆ సినిమా విడుదలకు ముందు విడుదల తర్వాత సినిమా ఫెయిల్ అయిన సందర్భంలో ఆ ఒత్తిడి మరింత పెరుగుతూ ఉంటుంది.
మరి ముఖ్యంగా లక్షణాదిమంది అభిమానులు ఉన్న నటీనటులకు ఈ ఒత్తిడి ఇంకా పెరుగుతూ ఉంటుంది.ఎందుకంటే ప్రతి సినిమా బాగా చెయ్యాలి, అది విజయం సాధించాలి అనే కదా చేస్తారు.
అభిమానులకు నచ్చితే, ఆ ఉత్సాహంతో మరికొన్ని సినిమాలు చేస్తారు.

అయితే నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు( NTR Birthday ) అన్న విషయం మనందరికీ తెలిసిందే.ఈ సందర్భంగా ఎన్టీఆర్ ( NTR ) ఇంతకుముందు సందర్భాలలో చెప్పిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం… ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.మామూలుగా అందరి నటులకు ఒత్తిడి ఉంటే నాకు కూడా ఒత్తిడి ఉంటుంది.
అటువంటి సమయంలో నేను మా ఆవిడ ప్రణతికి ( Pranathi ) వంట చేసి పెడతాను.ఎందుకంటే చాలా మందికి తెలియదేమో నేను బ్రహ్మాండంగా వండుతాను.అన్ని వంటలూ బాగా చేస్తాను.ఒత్తిడి పెరిగినప్పుడల్లా నేను కిచెన్ లోకి వంట చేస్తూ వుంటాను.
అదే నా ఒత్తిడిని తగ్గిస్తుంది అని తెలిపారు ఎన్టీఆర్.

దీంతోపాటు ఒత్తిడి తగ్గించే మరో మార్గం కూడా ఉంది.అదే ట్రావెల్. నేను ఒత్తిడి ఉన్నప్పుడు నా కుటుంబాన్ని తీసుకొని ట్రావెల్ కి వెళతాను.నాకు దుబాయ్ అంటే చాలా ఇష్టం.నేను ఎక్కువ షాపింగ్ కూడా చేస్తాను.షాపింగ్ అంటే ఇష్టం.ఇంతకు ముందు నా కోసం చేసుకునేవాడిని, కానీ ఇప్పుడు పిల్లల షాపులు కనపడితే చాలు ఆగిపోయి, నా పిల్లల కోసం షాపింగ్ చేస్తాను.
ఇలా కుటుంబంతో ట్రావెల్ చెయ్యడం వలన కూడా ఒత్తిడి తగ్గించుకుంటాను అని చెప్పుకొచ్చారు ఎన్టీఆర్.కాగా ఎన్టీఆర్ సినిమాలలో నటిస్తూ ఎంత బిజీగా ఉన్నప్పటికీ సమయం దొరికినప్పుడు ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.