తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీలలో అక్కినేని ఫ్యామిలీ( Akkineni Family ) ఒకటి.అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా నాగార్జున(Nagarjuna) ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
ఇలా నాగార్జున వారసులుగా నాగచైతన్య( Nagachaitanya ) అఖిల్ ( Akhil ) కూడా ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నారు.నాగచైతన్య తన సినీ కెరియర్లో పలు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నప్పటికీ అఖిల్ మాత్రం ఇప్పటివరకు ఒక చెప్పుకోదగిన హిట్ సినిమాని కూడా అందుకోలేకపోయారని చెప్పాలి.
ఇలా నాగార్జున వారసులుగా అఖిల్ చైతన్య మాత్రం ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారు.

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోలు కూడా 100 కోట్ల కలెక్షన్లను రాబట్టి రికార్డులు సృష్టిస్తున్నారు.అయితే ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చైతన్య అఖిల్ మాత్రం ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోవడంతో అక్కినేని అభిమానులు ఈ విషయంలో చాలా ఫీల్ అవుతున్నారని తెలుస్తోంది.అయితే కొడుకుల భవిష్యత్తు కోసం తన జీవితంలో ఎప్పుడూ కూడా చేయని పనిని కొడుకుల కోసం నాగార్జున చేయబోతున్నారని తెలుస్తుంది.

నాగార్జున దేవుళ్లను పూజలను హోమాలను పెద్దగా నమ్మరట.తన కష్టం మీద తమ జీవితం ఆధారపడి ఉంటుందని నమ్మే స్వభావం నాగార్జునది.అలాంటిది కొడుకుల జీవితంలో దోషాలు ఉన్నాయని ఆ దోషాలు తొలగిపోవడం కోసం హోమం చేయాలని పండితులు చెప్పడంతో కొడుకుల భవిష్యత్తు కోసం ఈయన మొదటిసారి ఇలాంటి పూజా కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారని తెలుస్తుంది.ఇలా దోష పరిహార పూజలు చేయటం వల్ల తన కుమారులు ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారని తెలిసి నాగార్జున ఈ పని చేయడానికి సిద్ధమయ్యారట.
మరి ఈ పూజ కార్యక్రమాల అనంతరం అయినా ఈ ఇద్దరు హీరోలు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతారా లేదా వేచి చూడాలి.







