అక్కినేని అఖిల్ ( Akkineni Akhil )రీసెంట్ మూవీ ఏజెంట్ ( agent )ఎన్నో భారీ అంచనాలతో రాగా అది కాస్త తుస్సుమన్నది.సురేందర్ రెడ్డి మీద చాలా హోప్స్ పెట్టుకోగా సినిమా చివరి వరకు షూటింగ్ చేస్తూ అనుకున్న టైం కి రిలీజ్ అవ్వాలని హడావిడిగా రిలీజ్ చేసే సరికి సినిమా రిజల్ట్ తేడా కొట్టింది.
ఈ క్రమంలో అఖిల్ నెక్స్ట్ సినిమాకు ఇలాంటి తప్పిదాలు జర్గకుండా జాగ్రత్త పడతాడని అనుకున్నారు.కానీ అఖిల్ తన తర్వాత సినిమాను కూడా రిస్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఏజెంట్ సినిమా దగ్గర దగ్గర 80 కోట్ల దాకా బడ్జెట్ అయినట్టు తెలుస్తుంది.సినిమా భారీ లాస్ తెచ్చింది.

అయితే తన నెక్స్ట్ సినిమా కూడా అఖిల్ 100 కోట్ల దాకా బడ్జెట్ తో చేస్తున్నాడని టాక్.యువి క్రియేషన్స్( UV Creations ) బ్యానర్ లో కొత్త దర్శకుడు అనిల్ ని పరిచయం చేస్తూ ఈ సినిమా చేస్తున్నారట.పీరియాడికల్ మూవీగా ఈ సినిమా భారీ బడ్జెట్ తో వస్తుందని టాక్.మరి ఏజెంట్ తో షాక్ తిన్నా సరే అఖిల్ దాన్ని మించిన బడ్జెట్ తో సినిమా చేయడం ఫ్యాన్స్ కి షాక్ ఇస్తుంది.
ఇదేకాదు నాగార్జున 100వ సినిమాలో కూడా అఖిల్ ఇంపార్టెంట్ రోల్ చేస్తారని తెలుస్తుంది.







