చిరంజీవి, బాలకృష్ణ, రవితేజ ముగ్గురు చేతిలో దెబ్బలు తిన్నా.. రచయిత సంచలన వ్యాఖ్యలు!

టాలీవుడ్ ప్రముఖ రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి( BVS Ravi ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.బీవీఎస్ రవి అన్ స్టాపబుల్ షోతో ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్నారు.

 Bvs Ravi Sensational Comments About Raviteja Chiranjeevi Balakrishna Goes Viral-TeluguStop.com

వాంటెడ్, జవాన్ సినిమాలకు దర్శకత్వం వహించిన బీవీఎస్ రవి కెరీర్ పరంగా భారీ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు.మన చుట్టాలు మనకు చెప్పలేనిది స్నేహితులు చెబుతారని ఆయన అన్నారు.

జవాన్ తర్వాత రవితేజతో ( Raviteja ) సినిమా చేయాలని అనుకున్నానని కరోనా, లాక్ డౌన్ వల్ల ప్లాన్స్ మారిపోయాయని బీవీఎస్ రవి తెలిపారు.జవాన్ కు ముందు థాంక్యూ సిద్ధమైందని ఆయన చెప్పుకొచ్చారు.

ప్రభాస్ గారు ఒక సినిమా సెకండాఫ్ రాయమన్నారని ఆయన కామెంట్లు చేశారు.ప్రభాస్ ఆకాశమంత హృదయం ఉన్న వ్యక్తి అని బీవీఎస్ రవి వెల్లడించారు.

నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని బీవీఎస్ రవి పేర్కొన్నారు.

Telugu Balakrishna, Bvs Ravi, Bvsravi, Chiranjeevi, Dhamaka, Raviteja, Writer Bv

ఖైదీ బ్రదర్స్ సినిమాలో చిన్న రోల్ చేశానని ఆయన తెలిపారు.నాయుడమ్మ సినిమాలో మంచి పాత్ర చేశానని ఆయన తెలిపారు.అయోధ్య సినిమాలో విలన్ గా చేశానని బీవీఎస్ రవి అన్నారు.

క్రాక్ లో నా రోల్ కు మంచి పేరొచ్చిందని ధమాకా సినిమాలో( Dhamaka Movie ) కూడా రవితేజ ఛాన్స్ ఇప్పించారని ఆయన తెలిపారు.గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డిలో ఛాన్స్ ఇచ్చారని వాల్తేరు వీరయ్యలో కూడా ఛాన్స్ వచ్చిందని ఆయన తెలిపారు.

Telugu Balakrishna, Bvs Ravi, Bvsravi, Chiranjeevi, Dhamaka, Raviteja, Writer Bv

చిరంజీవి, రవితేజ, బాలకృష్ణ ముగ్గురు చేతుల్లో దెబ్బలు తినే పాత్రల్లో చేశానని బీవీఎస్ రవి అన్నారు.నన్ను కొట్టిన సినిమాలు అన్నీ 100 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకున్నాయని ఆయన తెలిపారు.బీవీఎస్ రవి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బీవీఎస్ రవికి నటుడిగా సినిమా ఆఫర్లు పెరుగుతున్నాయి.బీవీఎస్ రవి రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube