దేశంలో డిజిటల్ విప్లవం వచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.రూ.2 వేల నోటు ఉపసంహరణ సంతోషకరమన్నారు.దేశ హితం కోసం తీసుకున్న నిర్ణయమని తెలిపారు.
మోదీ ప్రభుత్వం వచ్చాక రైతులకు గిట్టుబాటు ధర అందుతోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.కేంద్రం నిధుల్లో 42 శాతం వాటా రాష్ట్రాలకు ఇస్తోందన్నారు.
రైతులకు ఎరువులపై రూ.లక్ష కోట్ల సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు.తెలంగాణలో కనీసం పంట బీమా కూడా ఇవ్వడం లేదని విమర్శించారు.పేదలకు ఇళ్లు నిర్మించే చిత్తశుద్ధి లేదు కానీ ప్రగతిభవన్, సచివాలయం రికార్డ్ సమయంలో కడతారని మండిపడ్డారు.







