కర్ణాటకలో కొలువుదీరనున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కర్ణాటకలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది.మధ్యాహ్నం 12.30 గంటలకు కంఠీరవ స్టేడియంలో ప్రమాణస్వీకారోత్సవం జరగనుంది.

 Congress Government In Karnataka-TeluguStop.com

ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ తో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.కాగా మంత్రులుగా డాక్టర్ జి.పరమేశ్వర, కేహెచ్ మునియప్ప, కేజే జార్జ్, ప్రియాంక్ ఖర్గే, ఎంబీ పాటిల్, సతీశ్ జార్కిహోళి, జమీర్ అహ్మద్ ఖాన్, రామలింగారెడ్డిలు ప్రమాణం చేయనున్నారు.వీరితో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

ఈ కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తో పాటు ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ లు హాజరుకానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube