మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని విచారణకు హాజరు కావాలని పేర్కొంటూ సీబీఐ నోటీసులు జారీ చేసింది.
అయితే తన తల్లి ఆరోగ్యం క్షీణించడంతో అవినాశ్ రెడ్డి నిన్న విచారణకు హాజరు కాలేదు.ఈ క్రమంలోనే కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తన తల్లి లక్ష్మీకి అవినాశ్ రెడ్డి చికిత్స చేయిస్తున్నారు.
తండ్రి భాస్కర్ రెడ్డి జైలులో ఉండటంతో అవినాశ్ రెడ్డి తల్లి వెంటే ఉన్నారు.ఈ నేపథ్యంలో తన తల్లి ఆరోగ్యం బాలేదని విచారణకు మరికొంత సమయం కావాలని సీబీఐ అధికారులకు విన్నవించిన సంగతి తెలిసిందే.
అవినాశ్ రెడ్డి అభ్యర్థనపై సీబీఐ ఇవాళ నిర్ణయం తెలుపనున్నారు.