ఘట్టమేదైనా పాత్రేదైనా ఎన్టీఆర్ దిగనంతవరకే.. ఈ దేవర సింగిల్ టేక్ హీరో అంటూ?

సీనియర్ ఎన్టీఆర్( Sr NTR ) ను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏ స్థాయిలో అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆయన మరణించి చాలా సంవత్సరాలే అయినా ప్రజల హృదయాల్లో మాత్రం ఎన్టీఆర్ జీవించి ఉన్నారు.

 Young Tiger Junior Ntr Single Take Hero Details Here Goes Viral Details, Ntr La-TeluguStop.com

సీనియర్ ఎన్టీఆర్ మనవడు అయిన జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తన టాలెంట్ తో తారక్ కోట్ల సంఖ్యలో అభిమానులకు చేరువయ్యారు.

Telugu Ntr, Ntr Latest, Ntr Devara-Movie

నిన్ను చూడాలని( Ninnu chudalani ) సినిమా నుంచి ఆర్.ఆర్.ఆర్( RRR ) వరకు ప్రతి సినిమాలో తారక్ నటన అద్భుతం అనే చెప్పాలి.టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగిల్ టేక్ హీరోగా తారక్ కు పేరుంది.

ఎలాంటి రోల్ ఇచ్చినా ఆ పాత్రకు న్యాయం చేసే విషయంలో తారక్ ముందువరసలో ఉంటారు.ఈ తరం హీరోలలో ఎన్టీఆర్ మాత్రమే కొన్ని పాత్రలలో నటించి మెప్పించగల టాలెంట్ ను కలిగి ఉన్నారని అభిమానులు భావిస్తున్నారు.

హీరోగా 4 లక్షల రూపాయల పారితోషికంతో కెరీర్ ను మొదలుపెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగారు.ఘట్టమేదైనా పాత్రేదైనా ఎన్టీఆర్ దిగనంతవరకే అని ఇతర హీరోల అభిమానులు సైతం చెబుతారు.

వచ్చే ఏడాది యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరగా( DEVARA movie ) ప్రేక్షకుల ముందుకు రానున్నారు.టైటిల్ తోనే తారక్ ప్రేక్షకుల మనస్సులను గెలుచుకున్నారు.

Telugu Ntr, Ntr Latest, Ntr Devara-Movie

ఎన్టీఆర్30( NTR30 ) పోస్టర్ లో తారక్ లుక్ ఒకింత సీరియస్ గా ఉన్నా పాత్ర స్వభావం అలా ఉండటం వల్లే పోస్టర్ ను ఈ విధంగా క్రియేట్ చేశారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు గ్లోబల్ స్టార్ గా మరింత ఎదిగి మరెన్నో విజయాలను అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.తారక్ నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించడంతో పాటు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube