ఎలాంటి చర్మ సమస్యలు ఉన్నా కేవలం 2 పదార్థాలతో నివారించుకుని అందంగా మెరిసిపోండి!

ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవనశైలి, కాలుష్యం, మేకప్ ఉత్పత్తుల‌ను అధికంగా వినియోగించడం, ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం తదితర కారణాల వల్ల ఏదో ఒక చర్మ సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.అయితే ఎలాంటి చర్మ సమస్యలు ఉన్నా సరే కేవలం రెండు పదార్థాలతో నివారించుకోవచ్చు.

 Avoid Any Skin Problems With Just 2 Ingredients! Skin Problems, Glowing Skin, Sk-TeluguStop.com

అందంగా మెరిసిపోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఏ సమస్యకు ఏ విధంగా చెక్ పెట్టాలో తెలుసుకుందాం ప‌దండి.

ఎక్కువ శాతం మంది త‌మ చర్మం నల్లగా ఉందని బాధపడుతుంటారు.చ‌ర్మాన్ని తెల్లగా మార్చుకునేందుకు ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు.అలాంటివారు ఒక బౌల్ లో రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి, నాలుగు టేబుల్ స్పూన్లు పచ్చి పాలు వేసి బాగా కలిపి చ‌ర్మానికి అప్లై చేసుకోవాలి.20 నిమిషాల అనంతరం వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.రోజు ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే చర్మం తెల్లగా మారుతుంది.

Telugu Tips, Clear Skin, Skin, Latest, Skin Care, Skin Care Tips, Skin Problems-

ఆయిలీ స్కిన్ తో బాధపడుతున్న వారు రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ పౌడర్( Oats powder ) లో కీరదోస‌కాయ‌ జ్యూస్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి.బాగా డ్రై అయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒకసారి చేస్తే ఆయిలీ స్కిన్ ( Oily skin )నుంచి విముక్తి లభిస్తుంది.

కొందరి స్కిన్ ఎప్పుడూ డల్ గా ఉంటుంది.అలాంటివారు రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలలో రెండు టేబుల్ స్పూన్ల టమాటో జ్యూస్‌ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి.

బాగా ఆరిన‌ తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఇలా చేస్తే స్కిన్ ఎప్పుడు బ్రైట్ గా మెరుస్తుంది.

Telugu Tips, Clear Skin, Skin, Latest, Skin Care, Skin Care Tips, Skin Problems-

మొటిమలతో ఇబ్బంది పడుతున్న వారు వన్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడిలో( cinnamon powder ) రెండు టేబుల్ స్పూన్లు పుదీనా జ్యూస్ మిక్స్ చేసి అప్లై చేసుకోవాలి.పది నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా చేస్తే మొటిమలు చాలా త్వరగా తగ్గుముఖం పడతాయి.చర్మం క్షణాల్లో గ్లోయింగ్ గా మెరవాలంటే రెండు టేబుల్ స్పూన్ల బొప్పాయి పేస్టులో వన్ టేబుల్ స్పూన్ తేనె ( honey )కలిపి ప్యాక్ లా అప్లై చేసుకోవాలి.

ఇర‌వై నిమిషాల అనంతరం ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా చేస్తే చర్మం క్షణాల్లో కాంతివంతంగా, ఆకర్షణీయంగా మారుతుంది.మ‌చ్చ‌ల‌తో మదన పడుతున్న వారు రెండు టేబుల్ స్పూన్లు అరటిపండు పేస్ట్ లో వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి చర్మానికి అప్లై చేసుకోవాలి.15 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా రోజు చేస్తే ఎలాంటి మ‌చ్చ‌లు ఉన్నా మాయం అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube