వాయిదా పడిన ఏజెంట్ ఓటీటీ స్ట్రీమింగ్... కారణం అదేనా?

అక్కినేని యువ హీరో అఖిల్ ( Akhil )తాజాగా నటించిన చిత్రం ఏజెంట్( Agent ).ప్రముఖ డైరెక్టర్ సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Akkineni Akhil Agent Movie Ott Streaming Sonyliv Postponed,akhil,agent,surender-TeluguStop.com

అయితే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ అంచనాలను చేరుకోలేక తీవ్ర నిరాశపరిచింది.ఏజెంట్ సినిమా కోసం ఎంతో కష్టపడిన అఖిల్ కి ఈ సినిమా తీవ్ర నిరాశనే కలిగించిందని చెప్పాలి.

ఇలా థియేటర్లో డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఏజెంట్ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ సోనీ లీవ్( Sony Live ) కొనుగోలు చేశారు.అయితే ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో చాలా తొందరగా డిజిటల్ మీడియాలో ప్రసారం కాబోతుందని అధికారక ప్రకటన కూడా విడుదల చేశారు.

Telugu Akhil, Ott, Sony Live, Surender Reddy, Tollywood-Movie

మే 19 నేడు అర్ధరాత్రి నుంచి ఈ సినిమా డిజిటల్ మీడియాలో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది అయితే ఇప్పటివరకు ఈ సినిమా స్ట్రీమింగ్ కాలేదు.దీంతో ఏజెంట్ సినిమా ఎక్కడ అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.అయితే ఈ విషయంపై సోనీ లీవ్ మాత్రం ఇంకా వేచి చూడండని చెబుతోంది.అయితే ప్రస్తుతమున్న సమాచార మేరకు అఖిల్‌ ఏజెంట్ ఓటీటీ స్ట్రీమింగ్ ను మరోసారి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

 ఇలా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి నోచుకోకపోవడానికి కారణం ఉందని తెలుస్తుంది.

Telugu Akhil, Ott, Sony Live, Surender Reddy, Tollywood-Movie

ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28వ తేదీ థియేటర్లలో విడుదల అయింది.ఇలా థియేటర్‌ రిలీజ్‌కు, ఓటీటీ విడుదలకు కనీసం 20 రోజుల గ్యాప్‌ కూడా లేకపోవడంతో మరో వారం పాటు పోస్ట్ పోన్‌ చేసినట్లు ప్రచారం జరుగుతుంది.మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే త్వరలోనే ఈ విషయం గురించి అధికారకంగా ప్రకటన తెలియజేయబోతున్నట్లు సమాచారం.థియేటర్లలో డిజాస్టర్ టాక్ కైవసం చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో అయినా ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube