అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారా.? బరువు తగ్గడం కోసం కఠినమైన డైట్ ను ఫాలో అవుతున్నారా.? రోజు చెమటలు చిందేలా వ్యాయామం చేస్తున్నారా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే పొడి చాలా బాగా సహాయపడుతుంది.ఈ పొడిని రోజు నైట్ తీసుకుంటే మరింత వేగంగా బరువు తగ్గుతారు.అదే సమయంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు సైతం లభిస్తాయి.మరి ఇంకెందుకు ఆలస్యం వెయిట్ లాస్ కు సహాయపడే ఈ పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు సోంపు గింజలు( Fennel seeds ), మూడు టేబుల్ స్పూన్లు ధనియాలు ( Coriander )వేసుకుని స్లో ఫ్లేమ్ పై ఒక నిమిషం పాటు వేయించుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న సోంపు మరియు ధనియాలు వేసుకోవాలి.అలాగే రెండు అంగుళాల దాల్చిన చెక్క రెండు, వన్ టేబుల్ స్పూన్ పటిక బెల్లం పొడి వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.
ఈ పౌడర్ ను ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో తయారు చేసుకున్న పొడిని హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుని బాగా కలిపి సేవించాలి.రోజు నైట్ నిద్రించడానికి గంట ముందు ఈ విధంగా చేస్తే ఎంత లావుగా ఉన్నవారు అయినా సరే కొద్ది రోజుల్లోనే సన్నబడతారు.శరీరంలో క్యాలరీలను త్వరగా బర్న్ చేసేందుకు ఈ పొడి చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.
అలాగే ఈ పొడిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.గ్యాస్, ఎసిడిటీ( Acidity ), మలబద్ధకం వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.నిద్రలేమి సమస్య దూరమవుతుంది.రాత్రుళ్ళు కంటినిండా నిద్ర పడుతుంది.అలాగే ఈ పొడిని తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నా సరే తగ్గుముఖం పడతాయి.