ప్రభాస్( Prabhas ) తన కెరియర్ లోనే చాలా స్టైలిష్ గా కనిపించిన సినిమా బిల్లా( Billa movie )…ఈ సినిమా మెహర్ రమేష్ ( Meher ramesh )దర్శకత్వం వహించిన విషయం మనకు తెలిసిందే.ఈ చిత్రాన్ని గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై కృష్ణంరాజు నిర్మించారు.
ఇందులో అనుష్క శెట్టి( Anushka shetty ) హీరోయిన్ గా నటిస్తే…రెబల్ స్టార్ కృష్ణంరాజు, నమిత, హన్సిక, జయసుధ తదితరులు కీలక పాత్రలను పోషించారు.మణిశర్మ స్వరాలు అందించారు.

ఇందులో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేశాడు.2009 ఏప్రిల్ 3న విడుదలైన ఈ చిత్రం భారీ హిట్ కాకపోయినా.ప్రేక్షకులను బాగా అలరించింది.ముఖ్యంగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.కేవలం నాలుగున్నర నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసి ఈ మూవీని రిలీజ్ చేశారు.అప్పటికి ప్రభాస్ కెరీర్‌లో బెస్ట్ ఫస్ట్‌డే కలెక్షన్స్ రాబట్టిన మూవీని బిల్లా రికార్డు సృష్టించింది…
ఈ సినిమాకు మణిశర్మ సంగీతం మరో ఆకర్షణ అయ్యింది.
అలాగే స్టైలిష్ హీరోగా ప్రభాస్ అందరినీ ఎట్రాక్ట్ చేశాడు.ప్రభాస్, అనుష్కల కెమిస్ట్రీ నెక్స్ట్ లెవల్.
గత ఏడాది ఈ సినిమాను రీ రిలీజ్ కూడా చేయగా.మంచి రెస్పాన్స్ దక్కింది.
ఇకపోతే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.బిల్లా మూవీకి ఫస్ట్ ఛాయిస్ ప్రభాస్ కాదట.

నిజానికి తమిళంలో అజిత్ నటించిన సూపర్ హిట్ మూవీ బిల్లా ను అదే టైటిల్ తో తెలుగులో రీమేక్ చేశారు.అయితే మొదట మెహర్ రమేష్ ఈ సినిమాను రామ్ చరణ్( Ram charan ) తో చేద్దామని అనుకున్నాడట.కానీ ఆ టైం రామ్ చరణ్ మగధీర సినిమాలో బిజీగా ఉండటం మళ్ళీ అంత పెద్ద క్యారెక్టర్ ని అప్పుడున్న రామ్ చరణ్ మోయగలడ అనేది కూడా ఆలోచించి చిరంజీవి వద్దు అని చెప్పాడట.అయితే చిరంజీవి కి కథ బాగా నచ్చినప్పటికీ.
ఈ కారణాల వల్ల దాన్ని రిజెక్ట్ చేశాడు చిరంజీవి…ఇక దాంతో ఈ కథ ప్రభాస్ దగ్గరికి వెళ్ళింది…అలా బిల్లా సినిమా బయటికి వచ్చింది…
.







