తెలంగాణలో మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.దీంతో ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి.
కర్నాటక ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ రెట్టింపు ఉత్సాహంతో తెలంగాణపై ఫోకస్ పెట్టింది.అటు బీజేపీ( BJP ) ఈసారి తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తోంది.
ఇక అధికార బిఆర్‌ఎస్ పార్టీ గురించి చెప్పవలసిన అవసరం లేదు.కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో పోల్చితే బిఆర్‌ఎస్ కే ఈ ఎన్నికలు మరింత కీలకం గా మారాయి.2014, 2018 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ( Brs )తిరుగులేని విజయం సాధించినప్పటికి.ఈసారి ఆ పార్టీకి గెలుపు అంత ఈజీ కాదనేది విశ్లేషకులు చెబుతున్నా మాట.ఎందుకంటే గతంతో పోల్చితే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బలం పెంచుకున్నాయి.

బిఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయంగా ప్రకటించుకుంటున్నాయి.దీంతో ప్రజల దృష్టి ఆ రెండు పార్టీలపై పడకుండా చేసుకోవడం గులాబీ బాస్ కు పెద్ద టాస్కే అని చెప్పవచ్చు.అందుకే పార్టీ నేతలను ఇప్పటి నుంచే గాడిలో పెట్టిందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కేసిఆర్.
ఆ మద్య దళితబంధు పథకంలో పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కేసిఆర్.తాజాగా ఎంపీ, ఎమ్మెల్యేలతో( MPs , MLAs ) జరిగిన సమావేశంలో జాగ్రతగా ఉండాలని మరోసారి హెచ్చరించారు.
ప్రతిఒక్క నేత ప్రజల్లో ఉండాలని, ఈ పదేళ్ళలో అమలైన పథకాల గురించి ప్రజలకు వివరించి చెప్పాలని సూచించారు.

ప్రజల్లో తిరిగేందుకు నిలక్ష్యం వహించే నేతలకు టికెట్లు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు కేసిఆర్.ఈసారి ఎన్నికలను ఏ మాత్రం అలసటగా తీసుకున్న అధికారం చేజారే అవకాశం ఉండడంతో ప్రతి విషయంలోనూ పక్క ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు కేసిఆర్.అయితే ఈసారి ఎన్నికల్లో 105 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సర్వేలు అన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని, అందరూ కష్టపడి పని చేస్తే మూడోసారి కూడా అధికారం మనదే అని చెబుతున్నారు గులాబీ బాస్.అయితే దళితబంధు వంటి పథకాలలో అక్రమాలు జరిగాయని స్వయంగాక సిఎంకే కేసిఆరే చెప్పడంతో విమర్శలకు తావిచ్చినట్లైంది.
అయితే ఆ వ్యాఖ్యలు కూడా కేసిఆర్ వ్యూహాత్మకంగానే చేశారనేది కొందరి వాదన.మొత్తానికి గులాబీబాస్ ఈసారి ఎన్నికల విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారనేది స్పష్టంగా అర్థమౌతోంది.







