ఇక్కడ పెళ్లికాని ప్రసాదులకు అమ్మాయిలు దొరక్క నానా ఇబ్బందులు పడుతుంటే, కొన్ని చోట్ల వరుళ్లు కాబోయే పెళ్లాలకు అడ్డమైన కండిషన్లు పెడుతున్న పరిస్థితి.అవును, మన దేశంలో పెళ్లిళ్లు అవ్వక చాలామంది అలాగే 40 ఏళ్ళవరకు ఉండిపోతున్నారు.
ఈ క్రమంలో తమకు పెళ్లిళ్లు అయ్యే అవకాశం కల్పించండి మంది యువకులు ఏకంగా ప్రభుత్వాలనే అభ్యర్థిస్తున్న పరిస్థితి.కర్నాటకలో( Karnataka ) అయితే, తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అబ్బాయిలను పెళ్లి చేసుకునే అమ్మాయిలకు నగదు కూడా అందిస్తామంటూ హామీలు కూడా ఇచ్చేస్తున్నారు.

ఇలాంటి తరుణంలో ఓ వ్యక్తి మాత్రం తన పెళ్లి కోసం గొంతెమ్మ కోరికలు కోరడం ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.ఈ కోరికలతోనే ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాడు ఆ వరుడు.ఇంతకీ ఆ వరుడు ఎవరంటే మన పొరుగు దేశమైన చైనాకు ( china )చెందిన అబ్బాయి.మనోడు పెళ్లి చేసుకునే అమ్మాయి జాబ్ చేయాలట.అంతేకాకుండా ఆమెకి కారు, బంగ్లా కూడా ఉండాలట.పైగా ఆ అమ్మాయికి అప్పులు, బ్యాంక్స్ లోన్స్ వంటివేవీ ఉండకూడదని కండిషన్ పెట్టాడు.

అంతేకాకుండా అమ్మాయి ఇంటి పనిలో బాగా నైపుణ్యం కలిగి వుండేదై ఉండాలని అంటున్నాడు.ఆమె జీతం కనీసం 12 వేల యువాన్లు అనే మన భారత కరెన్సీలో రూ.1,41,336.60 ఉండాలని పేర్కొన్నాడు.ఇక్కడ కొసమెరుపు ఏమంటే, సదరు అమ్మాయికి ఎలాంటి అప్పులు కూడా ఉండకూడదని స్పష్టం చేశాడు.అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.అమ్మాయికి 12 యువాన్ల జీతం కావాలని కోరిన ఈయన గారి జీతం కేవలం 6 వేల యువాన్లు మాత్రమే.అంటే భారతకరెన్సీలో రూ.71 వేలు సంపాదిస్తున్నాడు.మనోడికి సొంత ఇల్లు కాదుకదా, కారు కూడా లేదు.
అయినా భారీగా సంపాదిస్తున్న భార్యను కోరడంతో మనోడికి నెటిజన్లు బాగా ఏసుకుంటున్నారు.







