రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి రైతు వేదిక లో బద్దెనపల్లి క్లస్టర్ పరిధిలో గల ఆరు గ్రామాల రైతులకు ప్రత్యామ్నాయ పంటల గూర్చి ముఖ్యంగా ఆయిల్ ఫామ్ సాగుపై ( Oil palm cultivation )ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీపీ పడగల మానస రాజు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) వాణిజ్య పంటలైన ఆయిల్ ఫామ్ పై ప్రత్యేక దృష్టితో ఆయిల్ ఫామ్ సాగు చేసిన రైతులకు సబ్సిడీ అందిస్తూ ప్రోత్సహిస్తున్నారని కాబట్టి ఈ క్లస్టర్ పరిధిలో గల రైతులందరూ ఆయిల్ ఫాం సాగుపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ క్లస్టర్ పరిధిలో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులు కొక్కిరాల సత్యనారాయణ రావు,(బదేనపల్లీ) 9 ఏకరాలు, పన్యాల విట్టల్ రెడ్డి (రామన్న పల్లె) 7 ఏకరాలు సాగుచేసిన సందర్భంగా వారిని ఎంపీపీ పడగల మానస రాజు మరియు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘనంగా సన్మానించారు.వీరిని ఆదర్శంగా తీసుకొని ఆయిల్ ఫామ్ పై దృష్టి సారించాలని ఎంపీపీ కోరారు.
ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రాజిరెడ్డి, ఎంపీటీసీ చిలువేరు ప్రసూన,సర్పంచ్ ఆనందరావు ఏవో సందీప్,అగం రావు, ఏ ఈ ఓ లు, వివిధ గ్రామాల నాయకులు రైతు సోదరులు గ్రామస్తులు పాల్గొన్నారు.







