వచ్చే ఎన్నికల్లో గెలవడం టీడీపీకి అత్యంత కీలకం.ఎందుకంటే గత ఎన్నికల్లో ఘోర ఓటమి.
ఆ తరువాత పార్టీలో నెలకొన్న అసమానతలు, రాబోయే రోజుల్లో పార్టీ నాయకత్వంపై అనుమానాలు.ఇలా చాలా అంశాలే ఆ పార్టీని వేదిస్తున్నాయి.
దాంతో వీటన్నిటికి ఛెక్ పెట్టాలంటే వచ్చే ఎన్నికల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి.ఈసారి ఎన్నికల్లో ఏ మాత్రం తేడా కొట్టిన టీడీపీ ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది.
అందుకే చాలా పకడ్బందీ వ్యూహాలతో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు చంద్రబాబు.అయితే ఎన్నికల్లో గెలవాలంటే పార్టీకి హైప్ ఇవ్వడం మాత్రమే సరిపోదు.
నెగిటివిటీని కూడా అదిగమించి నిలబడాల్సివుంటుంది.అందుకే టీడీపీపై ఉన్న నెగిటివిటీని రూపు మపేందుకు చంద్రబాబు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు.

గతంలో చంద్రబాబుది( Chandrababu Naidu ) అవినీతి పాలన అని విమర్శలు గుపిస్తున్న జగన్ కు.తాను చేసిన అభివృద్దిని సెల్ఫీల రూపంలో చూపిస్తూ విమర్శలకు ఛెక్ పెడుతున్నారు చంద్రబాబు.ఇక చంద్రబాబు తనయుడు నారా లోకేశ్( Nara Lokesh ) పై కూడా గట్టిగానే నెగిటివిటీ ఉంది.లోకేశ్ పప్పు అని, రాజకీయాలు తెలియని లోకేశ్ ను సిఎం చేసేందుకు చంద్రబాబు చూస్తున్నారని, ఇలా రకరకాల విమర్శలు చేస్తున్నారు వైసీపీనేతలు.
ఈ విమర్శలన్నిటికి ఛెక్ పెట్టేందుకు లోకేశ్ తో పాదయాత్ర చేయిస్తూ.అసలైన నాయకుడిగా లోకేశ్ ను తీర్చి దిద్దుతూ విమర్శించే వల్ల నోళ్ళు ముయిస్తున్నారు చంద్రబాబు.ఇక టీడీపీపై జూ.ఎన్టీఆర్ ( N.T.Rama Rao Jr )రూపంలో మరో నెగిటివిటీ ఎప్పటికప్పుడు స్ప్రెడ్ అవుతునే ఉంటుంది.

ఎన్టీఆర్ ను ఉద్దేశపూర్వకంగానే టీడీపీకి దూరం చేశారని, లోకేశ్ కోసం చంద్రబాబాటు తారక్ ను దూరం పెడుతున్నారని, తారక్ పార్టీలోకి వస్తే చంద్రబాబు, లోకేశ్ లకు రాజకీయ భవిష్యత్ ఉండదని ఇలా రకరకాల విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి.అయితే వీటిపై ఎలా స్పందించిన అది పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున చంద్రబాబు మౌనం వహించే వారు.అయితే ఎన్నికలు దగ్గర పడే కొద్ది ఈ రకమైన విమర్శలు పెరిగే అవకాశం ఉన్నందున.ప్రస్తుతం ఎన్టీఆర్ ను దగ్గర చేసుకునే పనిలో ఉన్నారు చంద్రబాబు.ఆ మద్య తారక్ రాజకీయాల్లోకి రావడాన్ని ఆహ్వానిస్తానని నారా లోకేశ్ చెప్పడాన్ని బట్టి చూస్తే.ఈ విషయం స్పష్టంగా అర్థమౌతోంది.
ఇక తాజాగా తారక్ ను సీనియర్ ఎన్టీఆర్ శతదినోత్సవాలకు ఆహ్వానించి.తారక్ విషయంలో వచ్చే నెగిటివిటీకి ఛెక్ పెట్టాలని చూస్తున్నారు చంద్రబాబు.
ఇలా వచ్చే ఎన్నికల్లో పార్టీని దెబ్బతీసే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు అదినేత చంద్రాబాబు.







