కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ముందస్తు బెయిల్ కోసం సుప్రీం ధర్మాసనంలో అవినాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
హైకోర్టు వెకేషన్ బెంచ్ తన పిటిషన్ను విచారించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో కోరారు.
ఈ నేపథ్యంలో మరికాసేపటిలో సీజేఐ ధర్మాసనం ముందు అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాదులు మెన్షన్ చేయనున్నారు.
అయితే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.







