పెసర పంట సాగులో తెగుళ్ల నివారణకు మెరుగైన సూచనలు..!

పెసర పంటను( Pesara crop ) ఏ సీజన్లో అయినా పండించవచ్చు.ఈ పంటకు పెట్టుబడి చాలా తక్కువ.

 Better Suggestions For Prevention Of Pests In Paddy Crop Cultivation , Crop Cu-TeluguStop.com

పెసరను అంతర పంటగా, పచ్చి రొట్ట పైరుగా సాగు చేయవచ్చు.ఈ పంటకు రెండు లేదా మూడు నీటి తడులు అందిస్తే నాణ్యత గల దిగుబడి పొందవచ్చు.

రైతులకు పెసర, మినుము లాంటి పంటలు ఎంతో ఆసరాగా ఉంటాయి.ఈ పంటలు స్వల్ప కాలంలో చేతికి వస్తాయి.

అంతేకాకుండా పెట్టుబడి కూడా తక్కువగా ఉండడంతో చాలామంది రైతులు ఈ పంటలను సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.అయితే ఏ నెలలో ఈ పంట విత్తనాలను( seeds ) విత్తుకోవాలి.

ఈ పంటలకు ఆశించే చీడ పీడలను ఎలా గుర్తించి, నివారించాలో రైతులకు అవగాహన అవసరం.వేసవిలో అయితే ఫిబ్రవరి నుంచి మార్చి రెండవ వారం వరకు పెసర విత్తు కోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

వర్షాకాలంలో అయితే జూన్ లేదా జూలై నెలలో విత్తుకోవాలి.శీతాకాలంలో అయితే అక్టోబర్ లేదా నవంబర్ నెలలో విత్తుకోవాలి.

ఈ పెసర పంటలో కలుపు అనేది ప్రధాన సమస్య.కాబట్టి పెసర ను విత్తుకున్న గంటల లోపు నేల రకాన్ని బట్టి 200లీటర్ల నీటిలో 250 మిల్లీలీటర్ల పెండిమిథాలిన్ ( pendimethalin )1 ను కలిపి పిచికారి చేయాలి.పెసర పంటకు చిత్త పురుగుల బెడద కాస్త ఎక్కువ కాబట్టి వీటిని నివారణ కోసం లీటర్ నీటిలో 1.5 గ్రాముల ఎసిఫేట్ కలిపి పంటకు పిచికారి చేయాలి.వాతావరణం లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే రసం పీల్చే పురుగులు అధికంగా పంటను ఆశిస్తాయి ఈ పురుగుల నివారణకు లీటర్ నీటిలో ఒకటి.ఐదు మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ ( Monocrotophos )కలిపి పంటకు పిచికారి చేయాలి.

తెల్ల దోమల వల్ల పంటకు వైరస్ తెగులు వస్తాయి.నివారణకు లీటరు నీటిలో రెండు మిల్లీలీటర్ల డైక్లోరోవాస్ ను కలిపి పిచికారి చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube