స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్( Madhuri Dixit ) గురించి మనందరికీ తెలిసిందే.బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్ లలో ఈమె కూడా ఒకరు.
బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పాటు చేసుకుంది మాధురి దీక్షిత్.అంతే ఈ ముద్దుగుమ్మ డాన్స్ కు విపరీతమైన అభిమానులు ఉన్నారు.
నేడు మాధురి దీక్షిత్ 56వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటోంది.మొదట 1984లో అబోద్( Abod ) అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది మాధురి దీక్షిత్.
ఆ తర్వాత కొన్ని సినిమాల్లో సహాయ నటిగా చేసిన మాధురి తేజాబ్ సినిమాలో ముఖ్య పాత్రలో నటించి మెప్పించింది.

ఈ సినిమా ఆమెకి మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది.కాగా ఈమె రాం లఖాన్, పరిందా, త్రిదేవ్, కిషన్ కన్హయ్యా( Ram Lakhan, Parinda, Tridev, Kishan Kanhaiya ) లాంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించింది.బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ శ్రీదేవి కంటే ఎక్కువగా మాధురి దీక్షిత్ పాపులారిటీ సంపాదించుకుంది.1990లో దీక్షిత్ ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించిన దిల్ అనే ప్రేమ కథా చిత్రంలో ఆమిర్ ఖాన్ సరసన నటించింది.ఈ సినిమా ఆమె కెరీర్‌లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
అంతేకాకుండా మొట్ట మొదటి ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని కూడా తెచ్చి పెట్టింది.

కాగా ఈమె 1999లో డాక్టర్ శ్రీరామ్( Dr.Sriram ) నేనేను మాధురి దీక్షిత్ ను వివాహం చేసుకున్నారు.పెళ్లి తర్వాత అమెరికాకు వెళ్లిపోయారు.
దాదాపు ఒక దశాబ్దానికి పైగా అక్కడే నివసించారు.ఈ జంటకు అరిన్, ర్యాన్ అనే ఇద్దరు కుమారులు సంతానం.
ప్రస్తుతం మాధురి దీక్షిత్ రియాలిటీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది.ఇటీవలే ఓటీటీ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది మాధురి దీక్షిత్.
కాగా నేడు మాధురి దీక్షిత్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సెలబ్రిటీలు అభిమానులు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.







