‘SSMB28’ ఫస్ట్ గ్లింప్స్ రాబోతోందా.. మేకర్స్ భారీ సన్నాహాలు!

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”SSMB28”.సర్కారు వారి పాట వంటి సూపర్ హిట్ సినిమాతో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) దర్శకత్వంలో తన 28వ సినిమాను ప్రకటించి పూర్తి చేస్తున్నాడు.

 ‘ssmb28’ ఫస్ట్ గ్లింప్స్ రాబోత-TeluguStop.com

ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ముందు నుండి అందరిలో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

ఎందుకంటే వీరి కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి.రెండు కూడా మహేష్ డిఫరెంట్ గా కనిపించి ఫ్యాన్స్ ను ఆకట్టు కున్నాడు.

అతడు, ఖలేజా వంటి సినిమాల వచ్చాక దాదాపు పుష్కర కాలం తర్వాత మళ్ళీ సినిమా రాబోతుంది.అందుకే ఈ సినిమాపై ఫ్యాన్స్ లో క్రేజ్ పీక్స్ లో ఉంది.

Telugu Buzzmahesh, Mahesh Babu, Pooja Hegde, Sreeleela, Ssmb, Ssmb Glimpse, Toll

ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు మేకర్స్.ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కు భారీ రెస్పాన్స్ లభించింది.మరి ఈ సినిమా నుండి మరో అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఇప్పుడు అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది.సూపర్ స్టార్ కృష్ణ జయంతి రోజున అంటే మే 31న ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ( SSMB28 first glimpse ) రిలీజ్ చేయనున్నారట.

Telugu Buzzmahesh, Mahesh Babu, Pooja Hegde, Sreeleela, Ssmb, Ssmb Glimpse, Toll

ఇందుకు గ్రాండ్ గా సన్నాహాలు కూడా చేస్తున్నారని తెలుస్తుంది.అందుతున్న సమాచారం ప్రకారం ఈ గ్లింప్స్ లెంగ్త్ 80 సెకండ్స్ ఉంటుందట.ఈ మొత్తం నిడివిలో మహేష్ లుక్ తో పాటు మాస్ యాక్షన్ సీన్స్, డైలాగ్స్ మాత్రమే ఉండేలా కట్ చేసారని టాక్.దీంతో ఈ గ్లింప్స్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

కాగా ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube