యంగ్ రెబల్ స్టార్ పభాస్ ( Yang rebel star Prabhas )పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటడంతో పాటు వరుసగా పాన్ వరల్డ్( Pan world ) స్థాయి ప్రాజెక్ట్ లలో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.ప్రభాస్ తో సినిమా అంటే ఖర్చు విషయంలో రాజీ పడకూడదని నిర్మాతలు సైతం ఫిక్స్ అయ్యారు.
ఈ స్టార్ హీరోను నమ్మి నిర్మాతలు 2000 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చు చేస్తున్నారు.అదే సమయంలో ప్రభాస్ సినిమాలకు 400 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది.
ప్రభాస్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటంతో నిర్మాతలకు ఊహించని స్థాయిలో లాభాలు వస్తున్నాయి.అదే సమయంలో పలు సర్వేలలో సైతం ప్రభాస్ నంబర్ వన్ స్థానంలో నిలుస్తున్నారు.
తాజాగా ఓరమ్యాక్స్ సర్వే( Ormax media ) ఫలితాలు వెలువడగా ఈ సర్వేలో ప్రభాస్ తొలి స్థానంలో నిలవడం గమనార్హం.ప్రభాస్ కు తిరుగే లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ప్రభాస్ తొలి స్థానంలో నిలవగా కెరీర్ పరంగా బిజీగా ఉన్న చరణ్ రెండో స్థానాన్ని( Charan ) సొంతం చేసుకున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( JR NTR ) కు ఈ జాబితాలో మూడో స్థానం దక్కగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం.గతేడాది సర్కారు వారి పాట సినిమాతో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచారు.న్యాచురల్ స్టార్ నాని ఈ ఏడాది దసరా మూవీతో సక్సెస్ ను సొంతం చేసుకోగా ఈ హీరోకు ఆరో స్థానం దక్కింది.

దసరా మూవీ సక్సెస్ వల్లే నాని ఆరో స్థానంలో నిలిచారని కామెంట్లు వినిపిస్తున్నాయి.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ జాబితాలో ఏడో స్థానంలో నిలిచారు.పవన్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తే పవన్ స్థానం మరింత మెరుగుపడే ఛాన్స్ అయితే ఉంది.వాల్తేరు వీరయ్య సినిమాతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న చిరంజీవి ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలవగా ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేకపోయినా విజయ్ దేవరకొండ ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచారు.
మాస్ మహారాజ్ రవితేజ ఈ జాబితాలో పదో స్థానాన్ని సొంతం చేసుకున్నారు.








