విజయానికి చుట్టాలు ఎక్కువ అపజయం ఎప్పుడూ అనాదే ….ఈ సూత్రం కాంగ్రెస్ విషయంలో మరొకసారి నిజమైనట్లుగా తెలుస్తుంది.
ఆ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం పట్టించుకోని ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు ఆ పార్టీపై ఆసక్తితో చూస్తున్నా…… కర్ణాటకలో సాధించిన విజయం కాంగ్రెస్పై ప్రతిపక్షాలకు నమ్మకాన్ని గౌరవాన్ని పెంచినట్లుగా జరుగుతున్న పరిణామాలు రుజువు చేస్తున్నాయి .
ఇంతకాలం ఆంటీ ముట్టినట్టుగా వ్యవహరించిన ప్రతిపక్ష పార్టీలు ఒక్కొక్కటిగా మద్దతు ప్రకటించడం కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆనందింప చేస్తుంది అని తెలుస్తుంది.పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ( Mamata Banerjee ) ఇప్పుడు కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు.వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులు బలంగా ఉన్నచోట తాము పోటీ పెట్టమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమబెంగాల్ సెక్రటేరియట్లో విలేకరులతో మాట్లాడిన ఆమె మతవాద రాజకీయాలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు .బలవంతులకు మరింత బలం చేకూర్చడంలో తప్పేమీ లేదని, కాంగ్రెస్ బలంగా ఉన్నచోట ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలని తాము భావిస్తున్నామని అదే మర్యాదను , సంప్రదాయాన్ని తమ పట్ల కూడా ఆ పార్టీ చూపించాల్సి ఉంటుందని, ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట ఆ పార్టీలకు ప్రాధాన్యత నివ్వాల్సిన అవసరం ఉంటుందంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు .

ఇంతకాలం కాంగ్రెస్తో అంటీముట్ట నట్టుగా వ్యవహరించిన మమతా బెనర్జీకి కర్ణాటక ఎన్నికల( Karnataka Elections ) ఫలితాలు ఆమె మూడ్ ను మార్చినట్లుగా తెలుస్తుంది.కేంద్రంలో ఐక్య కూటమి ఏర్పాటు చేయకపోతే మరొకసారి బిజెపి అధికారంలోకి వస్తుందన్న అంచనాల నేపథ్యంలో బాజాపాయేతర పార్టీలను కలుపుకొని విపక్ష కూటమి దిశగా ఇప్పటికే చాలా ప్రయత్నాలు జరిగాయి.

బీహార్ ఎమ్మెల్యే సీఎం నితీష్ కుమార్ ఆ దిశగా ప్రయత్నాలను వేగవంతం చేసిన విషయం తెలిసిందే కొత్తగా వచ్చిన విజయాలతో ఇప్పుడు కాంగ్రెస్ ఆ పోటానికి పెద్దన్న పాత్ర పోషించే అవకాశం వచ్చింది .ఇప్పుడు దీదీ కూడా మద్దతు ప్రకటించడంతో మోడీ ( Narendra Modi )పరివారానికి ఇబ్బందులు తప్పవని వార్తలు వస్తున్నాయి.సంఖ్యాపరంగా ఎక్కువ ఎంపీలు ఉన్న రాష్ట్రం కావడంతో ఇప్పుడు దీదీ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా మోడీకి శరాఘాతమేనని తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందన్న స్థితి నుంచి ఇప్పుడు భాజాపాను ఓడించే శక్తి కాంగ్రెస్కే ఉందన్నదని ప్రతిపక్షాల అంగీకరించే స్థాయికి ఒక్కసారిగా కాంగ్రెస్ పుంజుకోవడం విధి విచిత్రంగా చెప్పుకోవచ్చు.







