దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి.బానుడు ఉగ్రరూపం దాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగటం మామూలే అయినప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా ఉష్ణోగ్రతల్లో విపరీతమైన మార్పులు ( Temaratues )వస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా వాతావరణం లో వస్తున్న మార్పులు పొల్యూషన్ కంట్రోల్ పై ఆయా దేశాలు తీసుకోవలసిన జాగ్రత్తలను ఎత్తిచూపుతున్నాయి.ఇప్పటికే దేశవ్యాప్తంగా 46 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుగా వచ్చే 24 గంటల్లో హాఫ్ సెంచరీ మార్కును దాటుతుంది అన్న అంచనాలు ఉన్నాయి ఇప్పటికే ఈ దిశగా విపత్తు నిర్వహణ కేంద్రం హెచ్చరికలు చేసింది.

దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత( Telugu states )లు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సూచించారు ముఖ్యంగా వృద్ధులు బాలికలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తప్పనిసరి పరిస్థితుల్లోనే బయటకు వెళ్లాలని ఎండ నుంచి రక్షణ పొందే ఏర్పాట్లు చేసుకోవాలని పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని ఆయన సూచనలు చేశారు .వచ్చే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని తీవ్రస్థాయి వడగాల్పులు వేస్తాయని వస్తున్న వార్తల నేపథ్యంలోప్రజాలు ఆందోళనకు గురవుతున్నట్లుగా తెలుస్తోంది తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 194 మండలాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం( Weather station ) అంచనా వేస్తుంది అందువల్ల తప్పనిసరి అయితే తప్ప బయటకు వెళ్ళే పనులు పెట్టుకోవద్దని ఒకవేళ వెళ్లాల్సి వచ్చిన తగిన జాగ్రత్తలు తీసుకొని ఎండ వేడి నుంచి రక్షణ పొందే ఏర్పాట్లు చేసుకోవాలని వాతావరణ కేంద్రం సూచిస్తుంది .

ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం పెరుగుతున్నందునే ఇలా గత కొన్ని సంవత్సరాలుగా వాతావరణం లో తీవ్ర మార్కులు వస్తున్నాయని ఎల్ నినో లు హీట్ వేవ్ లో ఏర్పడుతున్నాయని , ఇప్పటికైనా ప్రపంచ దేశాలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ భూగోళం మానవ నివాసానికి పనికిరాకుండా పోతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .







