నెలసరి సమయంలో పొత్తికడుపులో నొప్పి తగ్గాలంటే ఏమి చేయాలో తెలుసా..?

నెలసరి సమయంలో ఆడవారు పొత్తికడుపులో విపరీతమైన నొప్పిని అనుభవిస్తూ ఉంటారు.అలాగే నడుము నొప్పితో కూడా చాలామంది ఎంతగానో బాధపడుతూ ఉంటారు.

 Do You Know What To Do To Reduce Abdominal Pain During Menstruation, Abdominal-TeluguStop.com

నెలసరి సమయంలో గర్భాశయ కండరాలు సంకోచించడం వల్ల ఈ నొప్పి ఎక్కువగా ఉంటుంది.నొప్పితో పాటు తల తిరిగినట్లుగా ఉండడం, వాంతులు, తలనొప్పి ఇంకా డయోరియా వంటి లక్షణాలు కూడా నెలసరి సమయంలో కొందరు మహిళలలో కనిపిస్తూ ఉంటాయి.

చాలా మంది స్త్రీలు ఈ నొప్పిని తగ్గించుకోవడానికి రకరకాల ఇంటి చిట్కాలను పాటిస్తూ ఉంటారు.ఇంటి చిట్కాలతో పాటు నెలసరి సమయంలో మహిళలు ఈ మూడు పోషకాలు ఉండే ఆరాలను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

ఈ పోషకాలను తీసుకోవడం వల్ల నెలసరి సమయంలో కలిగే ఇబ్బందుల నుండి త్వరగా ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే నెలసరి సమయంలో కలిగే నొప్పిని తగ్గించుకోవడంలో మెగ్నీషియం మనకు చాలా ఉపయోగపడుతుంది.

Telugu Abdominal Pain, Amla, Banana, Tips, Pumpkin Seeds, Salmon Fish-Telugu Hea

శరీరంలో మెగ్నీషియం తక్కువగా ఉండడం వల్ల ఈ నొప్పులు చాలా ఎక్కువగా ఉంటాయి.మెగ్నీషియం కండరాలకు విశ్రాంతి కలిగించడంతోపాటు నొప్పిని కలిగించే ప్రోస్టాగ్లాండిన్ తగ్గించడంలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.అంతేకాకుండా నెలసరి సమయంలో మేగ్నిషియం ఎక్కువగా ఉండే గుమ్మడి గింజలు, అరటిపండు, ఉసిరికాయ ఇంకా ఆవకాడో( Avocado ) వంటి వాటిని తీసుకోవడం వల్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పి తగ్గుతుంది.ఇంకా అదే విధంగా శరీరంలో క్యాల్షియం స్థాయి తక్కువగా ఉండడం వల్ల కూడా కండరాల నొప్పులు, ఇంకా సంకోచాలు ఎక్కువగా ఉంటాయి.

Telugu Abdominal Pain, Amla, Banana, Tips, Pumpkin Seeds, Salmon Fish-Telugu Hea

కాల్సిఫెరోల్ లేదా విటమిన్ డి క్రియాశీల రూపం నొప్పిని కలిగించే ప్రోస్టాగ్లాండిన్ స్థాయిలను అదుపులో ఉంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.శరీరంలో తగినంత విటమిన్ డి ఇంకా అలాగే క్యాల్షియం ఉండడం వల్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తీవ్రత తక్కువగా ఉంటుంది.

Telugu Abdominal Pain, Amla, Banana, Tips, Pumpkin Seeds, Salmon Fish-Telugu Hea

పుట్టగొడుగులు, కోడిగుడ్డు( Egg ) పచ్చసొన ఇంకా సాల్మన్ చేపలలో( Salmon Fish ) విటమిన్ డి చాలా ఎక్కువగా ఉంటుంది.అలాగే ఎండలో కూర్చోవడం వల్ల కూడా తగినంత విటమిన్ డి సులభంగా లభిస్తుంది.అలాగే విటమిన్ ఈ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా నెలసరి సమయంలో వచ్చే నొప్పి నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube