తాజాగా చెన్నై-కోల్ కత్తా( CSK vs KKR ) మధ్య జరిగిన మ్యాచ్లో గెలిచి, కోల్ కత్తా జట్టు ప్లే ఆఫ్( Playoffs ) ఆశలను సజీవం చేసుకుంది.కీలక మ్యాచ్లో చెపాక్ స్టేడియంలో చెన్నై జట్టును ఆరు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.
అయితే మ్యాచ్లో చెన్నై జట్టు ఇన్నింగ్స్ సమయంలో కోల్ కత్తా జట్టు కెప్టెన్ నితీష్ రాణా( Nitesh rana ) వ్యవహరించిన తీరు పలు విమర్శలకు దారితీసింది.చెన్నై జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆఖరి ఓవర్ లో కోల్ కత్తా జట్టు బౌలర్ వైభవ్ అరోరా కాస్త సతమతమయ్యాడు.
దీంతో స్లో ఓవర్ రేటు నమోదు అయ్యింది.

అంతేకాకుండా 30 యార్డ్ సర్కిల్ బయట ఐదుగురు కాకుండా నలుగురు ఫిల్డర్ లనే ప్లేస్ చేయాలని అంపైర్లు, నితీష్ రాణా కు చెప్పారు.ఈ విషయంలో నితీష్ రాణా కు, అంపైర్లకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఐపీఎల్ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందే అని అంపైర్లు నితీష్ రాణా కు తేల్చి చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు ఐపీఎల్ రూల్స్ పాటించకుండా ప్రతి విషయాన్నికి గొడవ పడడం ఎందుకంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

స్లో ఓవర్ రేటు కారణంగా బీసీసీఐ( BCCI ) జట్టు కెప్టెన్ నితీష్ రాణా కు 24 లక్షల జరిమానా విధించింది.మిగిలిన జట్టు సభ్యులకు ఆరు లక్షల జరిమానా లేదా మ్యాచ్ ఫీజులో 25% జరిమానా విధించారు.ఇంపాక్ట్ ప్లేయర్లకు జరిమానా విధించబడింది.
ఇకా ఈ మ్యాచ్లో చెన్నై జట్టు ను 144 పరుగులకే కట్టడి చేసి, కోల్ కత్తా జట్టు బ్యాటర్లు నితీశ్ రాణా, రింకూ సింగ్ అర్థ శతకాలతో జట్టుకు విజయాన్ని అందించారు.
నితీశ్ రాణా 44 బంతుల్లో ఆరు ఫోర్లులు, ఒక సిక్స్ తో 57 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.రింకూ సింగ్ 43 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 53 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
కోల్ కత్తా ఆడిన 13 మ్యాచ్లలో ఆరు మ్యాచులు గెలిచి ప్లే ఆఫ్ రేసులో నిలిచింది.







