ప్రస్తుతం తెలుగు లో ఉన్న హీరోయిన్లు అందరూ కూడా తెలుగు వాళ్ళు కాదు.ప్రస్తుతం తెలుగులో కొనసాగుతున్న వారంతా కన్నడ కు చెందిన హిరోయిన్స్.
వారిలో స్టార్ హిరోయిన్ లుగా ఎదిగిన వారు ఉన్నారు.అయితే ఇప్పుడు యంగ్ హీరోయిన్ శ్రీలీల( Srileela ) కూడా ఆ జాబితాలోకి చేరిపోయింది.
దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అందాలు ముద్దుగుమ్మ… తన క్యూట్ స్మైల్, గ్లామర్, డ్యాన్స్ యూల్లో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది.ఇంకా చెప్పాలంటే ఇప్పుడామె దర్శకనిర్మాతలందరికీ లక్కీ ఛార్జ్ గా మారిపోయింది.

దీంతో స్టార్ హీరోల సరసన కూడా ఛాన్స్ల ను అందుకుంటూ కెరీర్లో ముందుకెళ్తుంది.ముఖ్యంగా ‘ధమాకా’( Dhamaka ) సినిమాతో ఆమె క్రేజ్ నెక్స్ట్ లెవల్కు వెళ్లిపోయింది.దీంతో ఈ భామ ఏకంగా తొమ్మిది సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది.వీటిలో బాలయ్య, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, విజయదేవరకొండ లాంటి బడా హిరోలు ఉన్నారు.
చేతినిండా చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతోంది.తాజాగా విజయదేవకొండ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒప్పుకున్న చిత్రాల్లో కొన్ని షుటింగ్ దశలో ఉన్నాయి.

ఈ చిత్రాలతోపాటు వైష్ణవ్ తేజ్ తో( Vaishnav Tej ) ఓ సినిమా, నితిన్ 32, అనగనగా ఒక రోజు వంటి జూనియర్ హీరోల చిత్రాల్లోనూ నటించనుంది.కేరీర్ పరంగా బిజీగా ఉన్న చదువును మాత్రం వదలడం లేదు.ఓ వైపు డాక్టర్ చదువుతునే సినిమాలను కూడా బాలెన్స్ చేస్తోంది.
సోషల్ మీడియా లో ఏలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా వరుస సినిమాలతో దూసుకుపోతున్న శ్రీలీల ఖతాలో ఎన్ని హిట్లు పడతాయో చూడాలి…అలాగే శ్రిలిల చేస్తున్న సినిమాలను చూస్తే ఇక కొద్ది సంవత్సరాల పాటు ఇండస్ట్రీ లో తనే టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది అని అంటున్నారు…
.







